రిషితేశ్వరి కేసులో కొత్తకోణం! | New twist in rishiteswari suicide case | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!

Published Sat, Aug 1 2015 1:22 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

రిషితేశ్వరి కేసులో కొత్తకోణం! - Sakshi

రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!

గుంటూరు:  నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

కాగా రిషితేశ్వరితో పాటు మిగిలిన విద్యార్థులు మంగళగిరిలో సినిమా చూడలేదని, విజయవాడలోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్లో చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాత్రి 11 గంటలకు రిషితేశ్వరితో పాటు మిగతా విద్యార్థులు హాస్టల్కు చేరుకున్నారని, అనంతరం ఆమె భోజనం చేసి పడుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్తో పాటు హాస్టల్లో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement