
అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై కేసు నమోదు
మేడ్చల్: ప్రైవేట్ హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్న యువకుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మేడ్చల్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక హైటెక్ మోడ్రన్ హైస్కూల్‌లో వార్డెన్‌గా పని చేస్తున్న రవితేజ అదే హాస్టల్‌లో ఉంటున్న బాలికల పట్ల గత కొన్నిరోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని విషయం తన తల్లికి చెప్పడంతో.. విషయం బయటకు వచ్చింది.
దీంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.