
జహీరాబాద్: చిన్న విషయమై ఇద్దరు విద్యార్థులు పోట్లాడుకోగా హాస్టల్ వార్డెన్ వారిని తలకిందులుగా నిలబడాలంటూ శిక్ష విధించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్టీ హాస్టల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. శేఖాపూర్ తండాకు చెందిన పరమేశ్వర్, సీహెచ్ లక్ష్మణ్ హాస్టల్‌లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నారు. శనివారం వీరి చిన్న విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వార్డెన్ యాదయ్య ఇద్దరినీ పిలిచి తలకిందులుగా నిలిపి శిక్షించాడు. వార్డెన్ నిర్వాకాన్ని వీడియో తీసిన కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు.
ఇది వైరల్‌గా మారింది. ఈ విషయమై వార్డెన్ యాదయ్యను వివరణ కోరగా విద్యార్థులు హాస్టల్‌లోనే ఉంటూ సక్రమంగా బడికి వెళ్లడం లేదని, అందుకే 2 నిమిషాల పాటు శిక్షించానని తెలిపారు. ఇకపై వారు బడికి డుమ్మా కొట్టకుండా ఉండేందుకే భయపెట్టాను తప్ప శిక్షించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment