సాక్షి, చిత్తూరు: జగనన్న ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నల కల నెరవేరుతోంది. మంగళవారం రోజున సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ సంస్థ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిన వైఎస్సార్‌సీపీ తాజా ముందడుగుతో జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనం కోసం జగన్ సర్కార్ అంటూ జగనన్నకు జయజయ ధ్వానాలు పలికారు. ఈక్రమంలోనే సభా ప్రాంగణంలో కొందరు విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ యాత్రను ప్రశంసిస్తూ సాగిన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ‘పేదోళ్ల కన్నీరు తుడిచే చేయి నీవన్న.. కళ్లల్లో నిండే మా వెలుగే నీవన్న.. జగనన్న’ అనే పాట, విద్యార్థులు ఆట.. అక్కడ ఉన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment