Chittoor Dairy
-
Fact Check: నిర్జీవం బాబు సంస్కృతి.. జవజీవం జగన్ జాగృతి!
చంద్రబాబు హయాంలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలు, డెయిరీల పునరుద్ధరణకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తన పాదయాత్రలో పాడి రైతులకు ఇ చ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిత్తూరుతో సహా రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల కార్మికులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను అణాపైసలతో సహా చెల్లించడమే కాదు..స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆయా ఫ్యాక్టరీల ఆవరణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. ఇవేమీ పచ్చ మీడియాకు కనిపించడం లేదు. మేమంతా సిద్ధం అంటూ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు పర్యటనను పురస్కరించుకుని ‘జగన్... ఇదేనా మీ విశ్వసనీయత’ అంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. వాస్తవాలను ముసుగేసి జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా విషం కక్కింది. ఈ కథనంలో రామోజీ మరుగున పెట్టిన వాస్తవాలివి... – సాక్షి, అమరావతి/ చిత్తూరు అగ్రికల్చర్ బాబు హయాంలోనే నిర్వీర్యం.. సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలనూ నిర్జీవం చేసిన ఘనత చంద్రబాబుదే. ఈయనగారి హయాంలో మూతపడిన చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే, వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న ఈ నాలుగు చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో కొరగాకుండా చేసి, వాటిని 2003–04లో మూతపడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూతపడ్డాయి. చిత్తూరు చక్కెర కర్మాగారాన్ని ఒక పథకం ప్రకారం నీరుగార్చి 2015 జనవరిలో మూతపడేలా చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది చెరకు రైతులు, 550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. డెయిరీల మూతకు కారకుడు బాబే.. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన వివిధ జిల్లాల పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి తీసుకొ చ్చి, ఆ తర్వాత వాటిని సొంత కంపెనీలుగా తమను తాము ప్రకటించుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా మారిపోయాయి. అంతేకాదు... 1.20 లక్షల పాడి రైతుల కుటుంబాలకు జీవనాధారమైన చిత్తూరు విజయ డెయిరీని తన సొంత డెయిరీ హెరిటేజ్ అభివృద్ధి కోసం పణంగా పెట్టారు. 2002 ఆగస్టు 31న చిత్తూరు డెయిరీని మూతపడేలా చేశారు. ఇంకా.. 2017 జనవరి 23న పులివెందుల , 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీలు, 2018 నవంబర్ 30న కంకిపాడు మిని డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీలు చంద్రబాబు పాలనలోనే మూతపడ్డాయి. వీటిలో ఏ ఒక్క డెయిరీనీ తెరిపించేందుకు బాబు కనీస ప్రయత్నమూ చేయలేదు. పైగా ఉద్యోగులకు, రైతులకు వందల కోట్లు చెల్లించకుండా ఎగనామం పెట్టారు. బాబు ఎగ్గొట్టిన బకాయిల్ని చెల్లించిన జగన్ సర్కార్... రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కర్మాగారాలకు సంబంధించి బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన 72.86 కోట్లు చెల్లించింది. 2015 జనవరిలో మూతపడిన చిత్తూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి 450 మంది సీజనల్ కార్మికులకు పెండింగ్‌లో ఉండిన రూ. 31.22 కోట్ల వేతనాలను గతేడాది జూలైలో ఒకేసారి జగన్ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో ప్రతి కార్మికునికి రూ. 15 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు పెండింగ్ వేతనాలు చేతికందాయి. మరో వైపు ఉపసంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నీరుగారిపోయిన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినప్పటికీ సామర్థ్యానికి తగినట్టుగా చెరకు దొరకని పరిస్థితి నెలకొనడంతో స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చింది. చిత్తూరు ఫ్యాక్టరీ ఆవరణలో 25 ఎకరాలను ఈ మేరకు కేటాయించగా, త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని సంకల్పించింది. కర్మాగారాల ఆస్తులపై కానీ, స్థలాలపై కానీ ఆయా సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. చిత్తూరు డెయిరీ అభివృద్ది ఇలా.. ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చిత్తశుద్ధితో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను ప్రభుత్వమే చెల్లించింది. రూ. 385 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొ చ్చిన అమూల్ సంస్థకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి , పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలుత రూ.150 కోట్ల అంచనాతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పనీరు, యాగార్ట్, స్వీట్ల తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటునూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే రూ.35 కోట్ల మేరకు వె చ్చించి 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రాసెసింగ్ యూనిట్ భవన నిర్మాణ పనులు చేపట్టింది. వే బ్రిడ్జి , ప్రధాన గేటు నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. వెన్న, నెయ్యి ప్రాసెసింగ్ ¿యూనిట్ నిర్మాణ పనులూ చురుగ్గా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా డెయిరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పాడి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కార్మికులనూ ఆదుకున్నది ఈ ప్రభుత్వమే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే 2015 జనవరిలో చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీని ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం మూసేసింది. ఈ చర్యతో కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. కనీసం పెండింగ్ వేతనాలైనా చెల్లించాలని అప్పటి బాబు ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం కనికరించలేదు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం కార్మికులకు పదేళ్లుగా పెండింగ్‌లో ఉండిన రూ. 31.22 కోట్ల వేతనాలను ఒక్కసారిగా చెల్లించి ఆదుకుంది. – కేశవరెడ్డి, కార్మికుడు, చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీ -
‘చిత్తూరు’కు క్షీరాభిషేకం!
ఇవాళ మనం తెరిపిస్తున్న చిత్తూరు డెయిరీ కథ ఎలాంటిదంటే.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి తాను స్థాపించిన డెయిరీ కోసం, సొంత లాభం కోసం, సొంత జిల్లా రైతునైనా, పిల్లనిచ్చిన మామనైనా బలి పెట్టేస్తాడని చెప్పే మనిషి కథ ఇది! ఓ నీతిమాలిన రాజకీయ నాయకుడి కథ ఇదీ! ఒక గొప్ప మెడికల్ కాలేజీ మన చిత్తూరుకు వస్తుంటే అడ్డుకున్నది సాక్షాత్తూ ఈ చంద్రబాబునాయుడు, గజదొంగల ముఠా సభ్యుడైన ఈనాడు రామోజీరావు వియ్యంకుడే. స్థలాలివ్వకుండా ఈ గడ్డకు మంచి మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్న చరిత్ర వారిదే. వేలూరు మెడికల్ కాలేజీకి జరిగిన అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నా. – చిత్తూరు బహిరంగ సభలో సీఎం జగన్ సాక్షి, తిరుపతి: గత పాలకుల స్వార్థంతో రెండు దశాబ్దాలుగా మూతబడ్డ చిత్తూరు డెయిరీకి జీవం పోస్తూ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టబడితో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం చిత్తూరులో భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు సమీపంలోని చీలాపల్లి సీఎంసీ మెడికల్ కళాశాల, 300 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, విడదల రజని, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ, ద్వారక నాథరెడ్డి, ఎంఎస్ బాబు, నవాజ్‌బాషా.. ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు మేయర్ అముద, ఆర్టీసీ వైస్‌చైర్మన్ విజయానందరెడ్డి, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, అమూల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలివీ.. రెండు మంచి కార్యక్రమాలకు నాంది ఈరోజు జరుగుతున్న రెండు మంచి కార్యక్రమాల్లో మొదటిది.. ఏనాడో మూతపడ్డ అతి పెద్దదైన చిత్తూరు డెయిరీని తెరిపించేందుకు నాంది పలుకుతున్నాం. ఇక రెండోది.. దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజీలలో ఒకటైన వేలూరు సీఎంసీ ఏర్పాటుకు పునాది రాయి వేస్తున్నాం. దివంగత వైఎస్సార్ ఏనాడో స్థలాన్ని కేటాయించి ఇక్కడ మెడికల్ కాలేజీని తీసుకొచ్చే కలగన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత నిర్లక్ష్యానికి గురైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 14 ఏళ్ల తరువాత ఆయన బిడ్డగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. చిత్తూరు డెయిరీ చరిత్ర.. పాడి రైతుల మొహాల్లో చిరునవ్వులు విరబూయించిన చిత్తూరు డెయిరీని 20 ఏళ్ల క్రితం కుట్ర పూర్వకంగా మూసివేశారని జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ప్రజలు చెప్పిన మాటలు గుర్తున్నాయి. 1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పడిన చిత్తూరు డెయిరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపించేవి. 1988 – 1993 మధ్య రోజుకు సగటున 2.50 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో ఈ జిల్లా కర్మకొద్దీ చంద్రబాబు కళ్లు దానిపై పడ్డాయి. 1992లో తన సొంత డెయిరీ హెరిటేజ్ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి, పథకం ప్రకారం చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని చిత్తూరు డెయిరీని 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండా మూత వేసే స్థాయికి తీసుకెళ్లారు. సరిగ్గా హెరిటేజ్ ఏర్పాటైన పదేళ్లకు అతిపెద్ద సహకార డెయిరీని చంద్రబాబు హయాంలో మూతవేసే కార్యక్రమం చేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్ల బకాయిలు పెట్టి 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించేశారు. ఆర్నెళ్లకు ఒకసారి బోనస్.. ఆశ్చర్యమేమిటంటే.. సహకార రంగంలో అతి పెద్దదైన చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ డెయిరీ మాత్రం అదే సమయంలో లాభాల్లోకి పరుగెత్తుకుంటూ పోయింది. 20 ఏళ్లుగా మూతపడ్డ ఈ చిత్తూరు డెయిరీ దుస్థితి చూసి దానికి జీవం పోసి పాడి రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చా. మాట ప్రకారం రూ.182 కోట్ల బకాయిలు తీర్చి నేడు చిత్తూరు డెయిరీ తలుపులు తెరిచాం. ప్రపంచంలోనే అతిపెద్ద సహకార డెయిరీ అమూల్‌ను తేవటమే కాకుండా వారు ఇదే డెయిరీలో రూ.385 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని సంతోషంగా చెబుతున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి డెయిరీకి పాలు పోసే అక్కచెల్లెమ్మలకు లాభాలను బోనస్‌గా పంచిపెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రూ.150 కోట్లతో తొలిదశ పనులు రూ.150 కోట్లతో చిత్తూరు డెయిరీ తొలిదశ పనులు మొదలవుతున్నాయి. దాదాపు లక్ష లీటర్లతో మరో 10 నెలల వ్యవధిలో పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది. రానున్న రోజుల్లో ఇక్కడే దశలవారీగా బటర్, పాలపొడి, యూహెచ్‌టీ పాల విభాగం, ఛీజ్, పనీర్, యోగర్ట్, స్వీట్ తయారవుతాయి. ఐదు నుంచి ఏడెనిమిదేళ్లలో 10 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి డెయిరీ చేరుకుంటుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి. మరో 2 లక్షల మందికి అమూల్ రాకతో అవుట్‌లెట్స్, డిస్ట్రిబ్యూషన్ చానెళ్ల ద్వారా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. చిత్తూరు జిల్లానే కాకుండా రాయలసీమకు చెందిన పాడి రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు మంచి పాల సేకరణ ధర లభిస్తుంది. ఇతర డెయిరీలూ పెంచక తప్పలేదు సహకార రంగాన్ని పునరుద్ధరిస్తూ దేశంలోని అతి పెద్ద కోఆపరేటివ్ డెయిరీ అమూల్‌తో కలిసి 2020 డిసెంబర్ 2న జగనన్న పాల వెల్లువను ప్రారంభించాం. పాడి రైతుల నుంచి 8,78,56,917 లీటర్ల పాలను సేకరించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి 10 రోజులకొకసారి నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అమూల్ రాక ముందు 2020 డిసెంబర్ 2న గేదె పాల రేటు లీటరు రూ.67 ఉండగా అమూల్ వచ్చాక ఎనిమిది సార్లు రేటు పెంచుకుంటూ వెళ్లింది. ఈరోజు గేదె పాలు లీటర్ రూ.89.76 ఉంది. అమూల్ రాక ముందు ఆవు పాలు లీటర్ రూ.32 కూడా సరిగా ఉండేవి కాదు. అమూల్ వచ్చిన తర్వాత 8 సార్లు రేటు పెంచుకుంటూ వెళ్లడంతో రూ.43.69కి చేరుకుంది. ఇతర ప్రైవేట్ డెయిరీలు కూడా సేకరణ ధర పెంచక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. పాల సేకరణలో మనం తీసుకున్న చర్యల వల్ల అక్కచెల్లెమ్మలు, పాడి రైతన్నలకు రూ.4,243 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. నాన్ రెసిడెంట్ నాయకులు.. చంద్రబాబు, దత్తపుత్రుడు నా¯న్ రెసిడెంట్ నాయకులు. ఇద్దరూ మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లద్దరి కోసం హైదరాబాద్ పోవాల్సిందే. ఇద్దరికీ సామాజిక న్యాయం అసలే తెలియదు. పేదలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తామంటే అడ్డుకుంటారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే దాన్నీ అడ్డుకుంటారు. సంక్షేమ పథకాలు ఇస్తామంటే దాన్నీ అడ్డుకొనే కార్యక్రమం చేస్తారు. వీరికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు... దోపిడీ కోసమే! ఈరోజు యుద్ధం జరుగుతోంది జగన్‌తో కాదు. పేదవాడితో పెత్తందార్లకు యుద్ధం జరుగుతోంది. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. చిత్తూరుకు శుభవార్తలు ‘చిత్తూరు మున్సిపాల్టీకి సంబంధించి రూ.75 కోట్ల పనులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు కోరారు. ఆర్వోబీ, లిల్లీ బ్రిడ్జి కావాలని అడిగారు. ఇవన్నీ చేస్తాం. చిత్తూరులో ఎన్ని సచివాలయాలుంటే అన్నింటికీ రూ.50 లక్షలు చొప్పున వెంటనే మంజూరు చేస్తాం. ప్రతిపాదనలు అందించిన వెంటనే మంజూరవుతాయి. బీసీ భవనన్ నిర్మాణం జరుగుతుంది. కాపు భవ¯నాన్ని కూడా మంజూరు చేస్తున్నా. 37 కి.మీ. రోడ్ల ప్రతిపాదనలు రూపొందించి పనులు చేపడతాం. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చిత్తూరు చక్కెర కర్మాగారం ఉద్యోగులకు శుభవార్త చెబుతూ వారికి సంబంధించిన రూ.32 కోట్ల బకాయిలు క్లియర్ చేశాం. వారి మొహల్లో చిరునవ్వులు చూసేందుకు బకాయిలు క్లియర్ చేసిన తర్వాతే ఇక్కడకి వచ్చా. చిత్తూరులో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అడిగారు. దీనిపై ప్రతిపాదనల కోసం కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాం. మరికొన్ని విద్యాసంస్ధల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’ పాడి రైతన్నలకు లాభం: జైన్ మెహతా, అమూల్ ఎండీ చిత్తూరులో డెయిరీ స్థాపనకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. పాడి రైతులకు మరింత మేలు చేసే విధంగా అధిక ధరకు పాల సేకరణ చేస్తాం. గుజరాత్, మరో 16 రాష్ట్రాల్లో అమూల్ డెయిరీలున్నాయి. ఏటా 36 లక్షల మంది పాడి రైతుల నుంచి దాదాపు 10 బిలియన్ లీటర్ల పాలను సేకరిస్తున్నాం. రూ.7,200 కోట్ల టర్నోవర్‌తో అమూల్ సంస్థ అంతర్జాతీయంగా ఉత్తమ స్థానంలో ఉంది. వెన్నుపోటు వీరుడు.. ప్యాకేజీ శూరుడు! ‘‘ఇవాళ వీళ్ల పరిస్థితి ఏమిటంటే.. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేనాయన ఓ నాయకుడు! ఎవరైనా తైలం పోస్తే కానీ గ్లాసు నిండని వ్యక్తి మరో నాయకుడు! ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ శూరుడు! వీరిద్దరికీ పేదల బతుకుల గురించి, ప్రజల కష్టాల గురించి, మాటిస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి, ఒక మాటకున్న విలువ గురించిగానీ ఏమాత్రం తెలియదు. అలా బతకాలన్న ఆలోచనా లేదు. ఇద్దరూ కలసి ప్రజల్ని మోసం చేస్తూ 2014 – 19 మధ్య రాష్ట్రాన్ని ఏలారు. ఇద్దరూ కలసి రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలు, సామాజిక వర్గాలకు వెన్నుపోటు పొడిచారు’’ -
బంగారు జగనన్నకి బంగారం రాఖీ కట్టిన శైలజాచరణ్ రెడ్డి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ మేరకు ఆయన నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా సీఎం జగన్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్పర్సన్, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకురాలు శైలజా చరణ్ రాఖీ కట్టారు. అది కూడా బంగారంతో చేసిన రాఖీ కట్టారు. బంగారంలాంటి మనసున్న జగనన్నకు ఏమిచ్చినా తక్కువ కాబట్టి మహిళా లోకం తరఫు నుంచి బంగారం రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు శైలజా చరణ్‌రెడ్డి. చదవండి: బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్ -
చిత్తూరు డెయిరీకి భూమి పూజ.. జగనన్న పాటకు, విద్యార్థినుల ఆట
సాక్షి, చిత్తూరు: జగనన్న ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నల కల నెరవేరుతోంది. మంగళవారం రోజున సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ సంస్థ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిన వైఎస్సార్సీపీ తాజా ముందడుగుతో జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనం కోసం జగన్ సర్కార్ అంటూ జగనన్నకు జయజయ ధ్వానాలు పలికారు. ఈక్రమంలోనే సభా ప్రాంగణంలో కొందరు విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ యాత్రను ప్రశంసిస్తూ సాగిన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ‘పేదోళ్ల కన్నీరు తుడిచే చేయి నీవన్న.. కళ్లల్లో నిండే మా వెలుగే నీవన్న.. జగనన్న’ అనే పాట, విద్యార్థులు ఆట.. అక్కడ ఉన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. -
బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్.. మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు డెయిరీపై చంద్రబాబు కళ్లు పడ్డాయి. చంద్రబాబు హయాంలో అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసేశారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుంది. చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నాం. అమూల్ రాక ముందు లీటర్ గేదె పాల ధర రూ.67. అమూల్ వచ్చాక లీటర్ గేదె పాల ధర 89 రూపాయల 76 పైసలు. అమూల్ రాక ముందు ఆవుపాలు లీటర్ ధర రూ.32 కూడా లేదు. అమూల్ వచ్చాక ఆవు పాలు లీటర్ ధర 43 రూపాయల 69 పైసలు. వెల్లూరు మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీ. అడ్డంకులను దాటి వెల్లూరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నాం. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ‘‘చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్లాడు చంద్రబాబు.. చంద్రబాబు గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారు.. మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడు. ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామాలు చేస్తున్నారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! ‘‘54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను చంద్రబాబు అమ్మేశారు. తన మనుషులకు తక్కువ ధరకు సంస్థలను కట్టబెట్టేశారు. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని బాబు నమ్మకం. తన ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను అమ్మేసే చరిత్ర చంద్రబాబుది. పప్పు బెల్లాల కోసం అన్నీ చంద్రబాబు తన వారికి కట్టబెట్టారు. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాని నమ్ముకున్నారు. మంచి జరిగితేనే నాకు తోడుగా ఉండండి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మకండి. దత్తపుత్రుడి కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవారి గుండెలో స్థానం కోసం పనిచేస్తున్నాం.’’ అని సీఎం చెప్పారు. చదవండి: రైతుకుంది ధీమా, రామోజీకే లేదు.. ఆందోళన ఎక్కువైనట్టుంది, అందుకే ఇలా! -
హెరిటేజ్ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారు: సీఎం జగన్
Updates: ►సీఎంసీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►300 బెడ్స్ కెపాసిటీతో అత్యాధునిక సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం ►చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది: సీఎం జగన్ ►చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది ►పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా ►182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం ►అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ►హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. ►చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ►రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాక్షి, అమరావతి\చిత్తూరు: రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతోంది. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. సహకార డెయిరీలకు పాతరేసిన బాబు రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పాలు సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన పాల సరఫరా లక్ష్యంతో 6 వేల లీటర్ల సామర్థ్యంతో చిత్తూరు డెయిరీని ఏర్పాటు చేశారు. దశల వారీగా విస్తరించడంతో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద డెయిరీగా అవతరించింది. 1992–93 వరకు విజయవంతంగా పనిచేసిన ఈ డెయిరీని 1995లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం నిర్వీర్యం చేయడంతో చిత్తూరు డెయిరీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. లాభాల్లో కొనసాగుతున్న డెయిరీని స్వార్థ ప్రయోజనాలతో నిరీ్వర్యం చేసి ఆర్థిక నష్టాలకు గురిచేయడం ద్వారా 2002లో మూతపడేటట్టు చేశారు. చిత్తూరు డెయిరీనే కాదు.. బాబు హయాంలో 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరులోని మదనపల్లి డెయిరీతో సహా మరో 8 సహకార డెయిరీలను మూతపడేటట్టు చేశారు. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. తద్వారా సహకార రంగంలోఉన్న పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లేటట్టు చేశారు సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా.. సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతుల సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాలసేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకేసి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకు ఉన్న రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. మంగళవారం చిత్తూరులో జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ షమల్బాయ్ బి.పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొననున్నారు. ఒక్క చిత్తూరు డెయిరీకే నష్టాలు ఎందుకు? ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉన్న రెండు డెయిరీల్లో ఒకటి ఏటా లాభాలను పెంచుకుంటూ పోతే.. మరో డెయిరీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. రైతులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్న చిత్తూరు డెయిరీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత క్రమంగా నష్టాలను పెంచుకుంటూ పోతే.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ మాత్రం లాభాలను రెట్టింపు చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో దేశంలోని అమూల్ వంటి పలు సహకార డెయిరీలు లాభాల్లో నడుస్తుంటే ఒక్క చిత్తూరు డెయిరీ మాత్రమే నష్టాలను మూటకట్టుకుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి చివరకు 2002లో ఆ డెయిరీని మూసివేయించారు. ఇందుకోసం తనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు చిత్తూరు డెయిరీని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే హెరిటేజ్ పెట్టి 10 ఏళ్లు దాటింది. తన సొంత డెయిరీ కోసం సొంత జిల్లా రైతుల నోటిలో మట్టి కొడుతూ చిత్తూరు సహకార డెయిరీని మూయించేశారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి. చిత్తూరు డెయిరీ మూసివేత గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే హెరిటేజ్ డెయిరీ ఉలిక్కిపడటం చూస్తుంటే.. చేసిన తప్పును చెప్పకనే చెపుతోంది అని అర్థమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పచ్చని చిత్తూరు డెయిరీపై చంద్రబాబు పన్నాగం.. అసలేం జరిగిందంటే?
చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు. ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే.. కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది. డెయిరీ మూసివేత కుట్రకు నాంది చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది. హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి.. అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్‌ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్‌గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్‌గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు. జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్‌లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు. ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్ ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్‌గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు. విగ్రహాన్ని భద్రంగా ఉంచాం.. ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు. పచ్చ మీడియా దాచిన చరిత్ర 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి. ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది 1980లో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు. లక్షల కుటుంబాల జీవన ధార రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇపుడు డెయిరీ తెరుస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్‌ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు.