CM YS Jagan Fires On Chandrababu Naidu At Chittoor Public Meeting - Sakshi
Sakshi News home page

బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్‌

Published Tue, Jul 4 2023 12:53 PM | Last Updated on Tue, Jul 4 2023 6:29 PM

Cm Jagan Fires On Chandrababu In Chittoor Public Meeting - Sakshi

సాక్షి, చిత్తూరు: హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు.

చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్‌.. మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు డెయిరీపై చంద్రబాబు కళ్లు పడ్డాయి. చంద్రబాబు  హయాంలో అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసేశారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్‌ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్‌ చేస్తున్నాం. అమూల్‌ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుంది. చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నాం. అమూల్‌ రాక ముందు లీటర్‌ గేదె పాల ధర రూ.67. అమూల్‌ వచ్చాక లీటర్‌ గేదె పాల ధర 89 రూపాయల 76 పైసలు. అమూల్‌ రాక ముందు ఆవుపాలు లీటర్‌ ధర రూ.32 కూడా లేదు. అమూల్‌ వచ్చాక ఆవు పాలు లీటర్‌ ధర 43 రూపాయల 69 పైసలు. వెల్లూరు మెడికల్‌ కాలేజ్‌ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీ. అడ్డంకులను దాటి  వెల్లూరు మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నాం. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదు’’ అని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.
చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు

‘‘చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్లాడు చంద్రబాబు.. చంద్రబాబు గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారు.. మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడు. ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామాలు చేస్తున్నారు’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.
చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్‌ ప్రభుత్వమేనా..!

‘‘54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను చంద్రబాబు అమ్మేశారు. తన మనుషులకు తక్కువ ధరకు సంస్థలను కట్టబెట్టేశారు. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని బాబు నమ్మకం. తన ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను అమ్మేసే చరిత్ర చంద్రబాబుది. పప్పు బెల్లాల కోసం అన్నీ చంద్రబాబు తన వారికి కట్టబెట్టారు. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాని నమ్ముకున్నారు. మంచి జరిగితేనే నాకు తోడుగా ఉండండి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మకండి. దత్తపుత్రుడి కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవారి గుండెలో స్థానం కోసం పనిచేస్తున్నాం.’’ అని సీఎం చెప్పారు.
చదవండి: రైతుకుంది ధీమా, రామోజీకే లేదు.. ఆందోళన ఎక్కువైనట్టుంది, అందుకే ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement