అస్మదీయుల కోసం బాబు హయాంలో డెయిరీల మూత
చిత్తూరు డెయిరీకి జగన్ హయాంలోనే జవజీవాలు
పునః ప్రారంభానికి శరవేగంగా చర్యలు.. చక్కెర కర్మాగారాలనూ మూసేసింది బాబే
నేడు ఆ కార్మికులను ఆదుకున్నది జగన్
వాస్తవాలను దాస్తున్న రామోజీ
చంద్రబాబు హయాంలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలు, డెయిరీల పునరుద్ధరణకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తన పాదయాత్రలో పాడి రైతులకు ఇ చ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
చిత్తూరుతో సహా రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల కార్మికులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను అణాపైసలతో సహా చెల్లించడమే కాదు..స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆయా ఫ్యాక్టరీల ఆవరణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. ఇవేమీ పచ్చ మీడియాకు కనిపించడం లేదు.
మేమంతా సిద్ధం అంటూ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు పర్యటనను పురస్కరించుకుని ‘జగన్... ఇదేనా మీ విశ్వసనీయత’ అంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. వాస్తవాలను ముసుగేసి జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా విషం కక్కింది. ఈ కథనంలో రామోజీ మరుగున పెట్టిన వాస్తవాలివి... – సాక్షి, అమరావతి/ చిత్తూరు అగ్రికల్చర్
బాబు హయాంలోనే నిర్వీర్యం..
సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలనూ నిర్జీవం చేసిన ఘనత చంద్రబాబుదే. ఈయనగారి హయాంలో మూతపడిన చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, ఎన్‌వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే, వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న ఈ నాలుగు చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో కొరగాకుండా చేసి, వాటిని 2003–04లో మూతపడేలా చేశారు.
ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూతపడ్డాయి. చిత్తూరు చక్కెర కర్మాగారాన్ని ఒక పథకం ప్రకారం నీరుగార్చి 2015 జనవరిలో మూతపడేలా చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది చెరకు రైతులు, 550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
డెయిరీల మూతకు కారకుడు బాబే..
సహకార స్ఫూర్తితో ఏర్పాటైన వివిధ జిల్లాల పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి తీసుకొ చ్చి, ఆ తర్వాత వాటిని సొంత కంపెనీలుగా తమను తాము ప్రకటించుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా మారిపోయాయి. అంతేకాదు... 1.20 లక్షల పాడి రైతుల కుటుంబాలకు జీవనాధారమైన చిత్తూరు విజయ డెయిరీని తన సొంత డెయిరీ హెరిటేజ్ అభివృద్ధి కోసం పణంగా పెట్టారు.
2002 ఆగస్టు 31న చిత్తూరు డెయిరీని మూతపడేలా చేశారు. ఇంకా.. 2017 జనవరి 23న పులివెందుల , 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీలు, 2018 నవంబర్ 30న కంకిపాడు మిని డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీలు చంద్రబాబు పాలనలోనే మూతపడ్డాయి. వీటిలో ఏ ఒక్క డెయిరీనీ తెరిపించేందుకు బాబు కనీస ప్రయత్నమూ చేయలేదు. పైగా ఉద్యోగులకు, రైతులకు వందల కోట్లు చెల్లించకుండా ఎగనామం పెట్టారు.
బాబు ఎగ్గొట్టిన బకాయిల్ని చెల్లించిన జగన్ సర్కార్...
రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కర్మాగారాలకు సంబంధించి బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన 72.86 కోట్లు చెల్లించింది. 2015 జనవరిలో మూతపడిన చిత్తూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి 450 మంది సీజనల్ కార్మికులకు పెండింగ్‌లో ఉండిన రూ. 31.22 కోట్ల వేతనాలను గతేడాది జూలైలో ఒకేసారి జగన్ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో ప్రతి కార్మికునికి రూ. 15 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు పెండింగ్ వేతనాలు చేతికందాయి.
మరో వైపు ఉపసంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నీరుగారిపోయిన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినప్పటికీ సామర్థ్యానికి తగినట్టుగా చెరకు దొరకని పరిస్థితి నెలకొనడంతో స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చింది.
చిత్తూరు ఫ్యాక్టరీ ఆవరణలో 25 ఎకరాలను ఈ మేరకు కేటాయించగా, త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని సంకల్పించింది. కర్మాగారాల ఆస్తులపై కానీ, స్థలాలపై కానీ ఆయా సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం.
చిత్తూరు డెయిరీ అభివృద్ది ఇలా..
ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చిత్తశుద్ధితో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను ప్రభుత్వమే చెల్లించింది. రూ. 385 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొ చ్చిన అమూల్ సంస్థకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి , పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తొలుత రూ.150 కోట్ల అంచనాతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పనీరు, యాగార్ట్, స్వీట్ల తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్‌మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటునూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే రూ.35 కోట్ల మేరకు వె చ్చించి 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రాసెసింగ్ యూనిట్ భవన నిర్మాణ పనులు చేపట్టింది.
వే బ్రిడ్జి , ప్రధాన గేటు నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. వెన్న, నెయ్యి ప్రాసెసింగ్ ¿యూనిట్ నిర్మాణ పనులూ చురుగ్గా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా డెయిరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పాడి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
కార్మికులనూ ఆదుకున్నది ఈ ప్రభుత్వమే..
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే 2015 జనవరిలో చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీని ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం మూసేసింది. ఈ చర్యతో కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. కనీసం పెండింగ్ వేతనాలైనా చెల్లించాలని అప్పటి బాబు ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం కనికరించలేదు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం కార్మికులకు పదేళ్లుగా పెండింగ్‌లో ఉండిన రూ. 31.22 కోట్ల వేతనాలను ఒక్కసారిగా చెల్లించి ఆదుకుంది. – కేశవరెడ్డి, కార్మికుడు, చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీ
Comments
Please login to add a commentAdd a comment