
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలంలోని మావల శివారు ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్న బాలుడిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..మావల శివారు ప్రాంతంలోని ఎస్‌ఆర్ ప్రైం కార్పొరేట్ స్కూల్ బాలుడిపై మంగళవారం రాత్రి అదే పాఠశాలలో రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్ లైంగిక దాడి చేయగా విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కార్పొరేట్ కళాశాలల్లో కొరవడుతున్న పర్యవేక్షణ..
పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు ఎంత అడిగితే అంతా ఫీజులు చెల్లిస్తున్నా, తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనపై ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకుల పర్యవేక్షణ లోపంతో పాఠశాల, కళాశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment