చాక్‌పీస్‌తో ఆడుకున్నాడని...
విద్యార్థిని చితకబాదిన టీచర్
లంగర్‌హౌస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘటన
హైదరాబాద్: తరగతి గదిలో చాక్‌పీస్‌తో ఆడుకున్నాడనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని చితకబాదాడు. ముందటి పళ్లు ఊడేలా కొట్టాడు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు వెన్ను విరగొట్డాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివాసముండే ప్రీతిబాల, మహేశ్ యాదవ్‌ల కుమారుడు తనిష్క్ యాదవ్ (11). బాపూఘాట్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లి గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. తనిష్క్ గురువారం తరగతి గదిలో ఉండగా తోటి స్నేహితుడు అతనిపై చాక్‌పీస్ విసిరాడు.
అదే చాక్‌పీస్‌ను తనిష్క తిరిగి ఆ విద్యార్థిపై పడేశాడు. ఇది గమనిం చిన టీచర్ సుధీర్ ఆగ్రహంతో ఊగి పో యి తనిష్క్‌ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టా డు. విషయం తెలుసుకున్న స్థాని కులు, బాలుడి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరింత కోపం పెంచుకున్న సుధీర్ శుక్రవారం పాఠశాలకు వచ్చిన తనిష్క్‌పై అకారణంగా దాడికి దిగాడు. వెన్నుపూస భాగంలో తీవ్రంగా కొట్టడంతో బాలుడు కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు బాలుడిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.