సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్‌సీ మీటింగ్‌లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది.
సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్‌కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా.
మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన
Comments
Please login to add a commentAdd a comment