'ఐపీఎల్లో ఇలాంటివి మామూలే' | Nothing wrong in Uthappa's behaviour, says KKR skipper Gambhir | Sakshi
Sakshi News home page

'ఐపీఎల్లో ఇలాంటివి మామూలే'

Published Tue, Apr 14 2015 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

'ఐపీఎల్లో ఇలాంటివి మామూలే'

'ఐపీఎల్లో ఇలాంటివి మామూలే'

కోల్‌కతా: ఐపీఎల్-8 మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు సర్ఫరాజ్తో గొడవ పడిన కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ రాబిన్ ఊతప్పను కోల్కతా కెప్టెన్ గంభీర్ వెనకేసుకొచ్చాడు. ఐపీఎల్ వంటి ఉత్కంఠభరిత టోర్నీలో  ఇలాంటి సంఘటనలు మామూలేనంటూ గంభీర్ తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పేమీలేదని అన్నాడు.

శనివారం కోల్‌కతా, (బెంగళూరు)ల మధ్య మ్యాచ్ ముగిశాక ఉతప్ప.. సర్ఫరాజ్‌ కాలర్ పట్టుకుని తిట్టినట్లు వచ్చిన వార్తలపై గౌతీ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు ప్రాధాన్యత ఇవ్వరాదంటూ గౌతీ మీడియాని కోరాడు. ఇదిలావుండగా, సర్ఫరాజ్తో ఊతప్ప గొడవ పడిన విషయం తన దృష్టికి రాలేదని మ్యాచ్ రెఫెరీ, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ చెప్పాడు. కోల్కతా జట్టు అధికారులు కూడా ఈ వార్తలను ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement