ఉతప్ప-సర్ఫరాజ్‌ల ఘర్షణ? | Javagal Srinath denies any complaint of Uthappa-Sarfaraz scuffle | Sakshi
Sakshi News home page

ఉతప్ప-సర్ఫరాజ్‌ల ఘర్షణ?

Published Tue, Apr 14 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

ఉతప్ప-సర్ఫరాజ్‌ల ఘర్షణ?

ఉతప్ప-సర్ఫరాజ్‌ల ఘర్షణ?

 కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో శనివారం మ్యాచ్ తర్వాత ఉతప్ప (కోల్‌కతా), సర్ఫరాజ్ (బెంగళూరు)ల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ ముగిశాక సైట్ స్క్రీన్ వెనక... ఉతప్ప 17 ఏళ్ల సర్ఫరాజ్‌ను కాలర్ పట్టుకుని తిట్టినట్లు సమాచారం. ఇది గమనించిన బెంగళూరు క్రికెటర్లు డివిలియర్స్, దిండా పరిగెడుతూ వెళ్లి విడిపించారట. గొడవ ఎందుకు జరిగిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన శ్రీనాథ్ చెప్పారు. ‘రెండు జట్ల నుంచి నాకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదు’ అని శ్రీనాథ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement