నా బిడ్డకు గన్‌ పెట్టి నన్ను రేప్‌ చేశారు.. | gang rape on woman in Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ముజఫర్‌నగర్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్‌

Published Sat, Oct 7 2017 8:47 AM | Last Updated on Tue, Oct 16 2018 8:23 PM

gang rape on woman in Muzaffarnagar - Sakshi

సాక్షి, ముజఫర్‌నగర్ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల జాబితాలో మరొకటి చేరింది. ఉత్తర ప్రదేశ్లో ఓ మహిళను కొందరు వ్యక్తులు లాక్కెళ్లి మరీ సామూహిక అత్యాచారం చేశారు. ఆమె భర్త, బిడ్డల ముందే దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ముజఫర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల మహిళ, తన భర్త, మూడు నెలల బిడ్డతో కలిసి మోటర్‌ బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలో నలుగురు దుండగులు వారిపై దాడి చేశారు. మహిళను సమీపంలోని చెరకు తోటల్లోకి లాక్కెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

‘నా బిడ్డకు తుపాకీ గురి పెట్టి చంపుతామని బెదిరించి వాళ్లు నాపై దారుణానికి పాల్పడ్డారు’ అని బాధిత మహిళ మీడియాకు తెలిపారు. తన భర్తను కట్టేసి దుండగులు చితకబాదరని.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముజఫర్‌నగర్‌ ఎస్పీ అజయ్‌ సహదేవ్‌ బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు అజయ్‌ చెప్పారు. 

జైపూర్‌ : రాజస్థాన్‌ లో మరో దారుణం చోటు చేసుకుంది. సికర్‌ ప్రాంతంలో ఓ కాలేజీ విద్యార్థినిపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె చేత మద్యం తాగించి మరీ రేప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement