
పనిమనిషిపై కాల్పులు
ముజఫర్ నగర్: నాలుగు ఇళ్లలో పనిచేసుకుని జీవనం వెళ్లదీసుకుంటున్న ఓ మహిళను అతి దారుణంగా చంపేసిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ముజఫర్ నగర్ లోని షాబుద్దీన్ పూర్ గ్రామంలో బాధితురాలు పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు లోపలికి చొచ్చుకొచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినేష్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరిపై ఆయన ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.