ముజఫర్‌నగర్: మహారాష్ట్రలో భీమ్ ఆర్మీ కార్యకర్తలైన దళితులపై జరిగిన హింసాకాండకు నిరసనగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దళితులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ ముందు గురువారం సాయంత్రం బైఠాయించి మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత నాయకుడు వైభవ్ బావ్రా నాయకత్వంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన దళితులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దళితులను రక్షించడంలో, వారిపై జరుగుతున్న హింసాకాండను నిరోధించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అందువల్ల అక్కడి ప్రభుత్వాన్ని తొలగించాలని రాష్ట్రపతిని ఆ వినతిపత్రంలో కోరారు. బ్రిటిషు ప్రభుత్వ సహకారంతో మహారాష్ట్రలోని పీష్వాలతో దళితులకు జరిగిన భీమా-కోరెగాన్ యుద్ధం ద్విశతాబ్ది ఉత్సవాలను ఈనెల 1న జరుపుకుంటున్న దళితులపై అగ్రవర్ణాలవారు దాడిచేసిన సంఘటన విదితమే.