
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ముజఫర్‌నగర్‌లోని రాంపురి ప్రాంతంలో మహిళా వైద్యాధికారిని లైంగికంగా వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ నెల ఏడున బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెంటాడి లైంగికంగా వేధింపులకు గురిచేశారు.
దుండగుల చర్యను ప్రతిఘటించగా వారు తనను తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. మహిళ ఫిర్యాదుపై నిందితులు చందు సింగ్, బిహరి, మరో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment