ముజఫర్‌నగర్ : వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన ఓ మహిళపై ఇద్దరు వైద్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం అనారోగ్యానికి గురికావడంతో, వైద్య పరీక్షల నిమిత్తం తల్లి, సోదరుడితో కలిసి నగరంలోని ఓ క్లీనిక్‌కు వెళ్లారు. మహిళపై కన్నేసిన ఇద్దరు యువ డాక్టర్లు.. వైద్య పరీక్షల కోసం గదిలోకి రావాలని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.
(చదవండి : భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..)
ఈ సమయంలో ఆమె తల్లి, సోదరుడు గది బయటే ఉన్నారు. డాక్టర్ల ప్రవర్తన పట్ల విసుగు చెందిన మహిళ.. పరీక్షలు వద్దని చెప్పి ఇంటికి వెళ్లారు. అనంతరం డాక్టర్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు.. శనివారం క్లినిక్ వద్దకు వెళ్లి వైద్యులపై దాడి చేశారు.అనంతరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అశోక్, అనిల్ అనే ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment