doctores
-
బ్యాటరీ మింగేసిన చిన్నారి
పశ్చిమగోదావరి: ఆడుకునే బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీని పొరపాటున 11 నెలల పాప మింగేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లి.. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. దీంతో హుటాహుటిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.డాక్టర్లు చిన్నారి పొట్టను ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే వైద్యులు ఎండోస్కోపీ ద్వారా చిన్నారి పొట్టలోని బ్యాటరీని బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
సిజేరియన్ తర్వాత మహిళల ప్రధాన సమస్య ఇదే!
సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. నిజానికి సిజేరియన్‌కూ, బరువు పెరగడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఏమాత్రం శారీరక శ్రమలేకపోవడం వల్ల లేదా మరికొన్ని ఇతరత్ర అంశాల వల్లనూ కావచ్చు. సిజేరియన్ తర్వాత బరువు పెరగకుండా ఉండేందుకు... డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మహిళలు తప్ప... మిగతావారంతా సిజేరియన్ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం, అలసట వంటివి పడకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.నడక మొదలు పెట్టినప్పుడు రోజుకు కేవలం పదినిమిషాలు మాత్రమే నడవాలి. అలా నడుస్తూ మెల్లగా తాము నడిచే కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తూ పోతే మూడు నెలల నుంచి మహిళలు ఆరోగ్యకరంగా మారి ఎనిమిది నెలల తర్వాత నుంచి తమ అదనపు కొవ్వు కోల్పోవడం జరుగుతుంది. పిల్లలకు చనుబాలు ఇవ్వడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు. చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి -
చెకప్ కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..
ముజఫర్‌నగర్ : వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన ఓ మహిళపై ఇద్దరు వైద్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం అనారోగ్యానికి గురికావడంతో, వైద్య పరీక్షల నిమిత్తం తల్లి, సోదరుడితో కలిసి నగరంలోని ఓ క్లీనిక్‌కు వెళ్లారు. మహిళపై కన్నేసిన ఇద్దరు యువ డాక్టర్లు.. వైద్య పరీక్షల కోసం గదిలోకి రావాలని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. (చదవండి : భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..) ఈ సమయంలో ఆమె తల్లి, సోదరుడు గది బయటే ఉన్నారు. డాక్టర్ల ప్రవర్తన పట్ల విసుగు చెందిన మహిళ.. పరీక్షలు వద్దని చెప్పి ఇంటికి వెళ్లారు. అనంతరం డాక్టర్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు.. శనివారం క్లినిక్ వద్దకు వెళ్లి వైద్యులపై దాడి చేశారు.అనంతరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అశోక్, అనిల్ అనే ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. -
శామీర్‌పేట రేవ్ పార్టీలో మరో కోణం
-
రిసార్ట్స్‌లో డాక్టర్ల రేవ్ పార్టీ
-
యువతులతో డాక్టర్ల రేవ్‌పార్టీ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నగరంలో ఓఫాంహోజ్లో జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శివారులోని శామీర్‌పేట్‌లో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురు డాక్టర్లును శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు కూడా పోలీసుల తనిఖీలో పట్టబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని గజ్వేల్‌కు చెందిన డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు. రేవ్‌పార్టీకి తీసుకువచ్చిన అమ్మాయిలకు ముందుగానే హెచ్ఐవీ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమాచారం. రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం ముందుగా పోలీసులకు అందడంతో పక్క వ్యూహంతో వారు నిర్వహించిన తనిఖీలో వీరు పట్టబడ్డారు. రేవ్‌పార్టీల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేవ్‌పార్టీలో మరోకోణం.. వ్యాపార విస్తరణను పెంచుకునేందుకు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్లకు అమ్మాయిలను సరఫర చేసినట్లు తెలిసింది. డాక్టర్లకు అమ్మాయిలను సరఫరా చేసి.. దాని ద్వారా లబ్ధిపొందాలనే దురుబుద్ధితో ఫార్మా కంపెనీ ఈ తతంగం చేసింది. -
పసివాడి పాదంలో దిగిన గడ్డపార
ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు సిరిసిల్ల టౌన్ : తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఓపసివాడి పాదంలో గడ్డపార దిగింది. వైద్యులు రెండు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేసి తొలగించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన కోడూరి లక్ష్మీనారాయణ నేతకార్మికుడు. ఆయన కొడుకు నిఖిల్ మంగళవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఎదిరింట్లోకి ఆడుకోవడానికి వెళ్లాడు. మూలనఉన్న గడ్డపారను చూసి ఎత్తబోగా.. అది ప్రమాదవశాత్తు జారి నిఖిల్ పాదంలోకి దిగింది. బాలుడు రోదించడంతో స్థానిక అనంతనగర్‌లోని శ్రీవాణి నర్సింగ్ హోంకు తరలించారు. ప్రముఖ ఎముకల వైద్యుడు రమణారావు ఆపరేషన్ చేసి గడ్డపారను తొలగించారు. ఇరవైకి పైగా కుట్లు వేశామని, బాలుడిని తమ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు రమణారావు తెలిపారు.