సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. నిజానికి సిజేరియన్‌కూ, బరువు పెరగడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఏమాత్రం శారీరక శ్రమలేకపోవడం వల్ల లేదా మరికొన్ని ఇతరత్ర అంశాల వల్లనూ కావచ్చు. సిజేరియన్ తర్వాత బరువు పెరగకుండా ఉండేందుకు... డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మహిళలు తప్ప... మిగతావారంతా సిజేరియన్ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం, అలసట వంటివి పడకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.నడక మొదలు పెట్టినప్పుడు రోజుకు కేవలం పదినిమిషాలు మాత్రమే నడవాలి.
అలా నడుస్తూ మెల్లగా తాము నడిచే కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తూ పోతే మూడు నెలల నుంచి మహిళలు ఆరోగ్యకరంగా మారి ఎనిమిది నెలల తర్వాత నుంచి తమ అదనపు కొవ్వు కోల్పోవడం జరుగుతుంది. పిల్లలకు చనుబాలు ఇవ్వడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment