- ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
పసివాడి పాదంలో దిగిన గడ్డపార
Published Tue, Jul 19 2016 9:59 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
సిరిసిల్ల టౌన్ : తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఓపసివాడి పాదంలో గడ్డపార దిగింది. వైద్యులు రెండు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేసి తొలగించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన కోడూరి లక్ష్మీనారాయణ నేతకార్మికుడు. ఆయన కొడుకు నిఖిల్ మంగళవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఎదిరింట్లోకి ఆడుకోవడానికి వెళ్లాడు. మూలనఉన్న గడ్డపారను చూసి ఎత్తబోగా.. అది ప్రమాదవశాత్తు జారి నిఖిల్ పాదంలోకి దిగింది. బాలుడు రోదించడంతో స్థానిక అనంతనగర్‌లోని శ్రీవాణి నర్సింగ్ హోంకు తరలించారు. ప్రముఖ ఎముకల వైద్యుడు రమణారావు ఆపరేషన్ చేసి గడ్డపారను తొలగించారు. ఇరవైకి పైగా కుట్లు వేశామని, బాలుడిని తమ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు రమణారావు తెలిపారు.
Advertisement
Advertisement