opration
-
పురుడుపోసి.. బ్లేడు మరచి
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): సంచనాలకు మారు పేరు అయిన రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్ మరో సంచలనానికి వేదికైంది. కొంతకాలం క్రితం పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రసూతి విభాగంలో చేరిన ఒక గర్భిణికి ఆపరేషన్ చేసి పురుడుపోశారు. అనంతరం కడుపులో బ్లేడ్ మరిచిపోయి కుట్లు వేసేశారు. దీనితో మహిళకు కడుపు నొప్పి తరచూ రావడంతో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో వైద్యం చేసేందుకు ఉపయోగించే బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినట్లు గుర్తు రావడంతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరారు. అయితే ఆ మహిళ వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై హాస్పటల్ సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్ ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టి రాలేదన్నారు. -
పసివాడి పాదంలో దిగిన గడ్డపార
ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు సిరిసిల్ల టౌన్ : తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ఓపసివాడి పాదంలో గడ్డపార దిగింది. వైద్యులు రెండు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేసి తొలగించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్కు చెందిన కోడూరి లక్ష్మీనారాయణ నేతకార్మికుడు. ఆయన కొడుకు నిఖిల్ మంగళవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఎదిరింట్లోకి ఆడుకోవడానికి వెళ్లాడు. మూలనఉన్న గడ్డపారను చూసి ఎత్తబోగా.. అది ప్రమాదవశాత్తు జారి నిఖిల్ పాదంలోకి దిగింది. బాలుడు రోదించడంతో స్థానిక అనంతనగర్లోని శ్రీవాణి నర్సింగ్ హోంకు తరలించారు. ప్రముఖ ఎముకల వైద్యుడు రమణారావు ఆపరేషన్ చేసి గడ్డపారను తొలగించారు. ఇరవైకి పైగా కుట్లు వేశామని, బాలుడిని తమ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు రమణారావు తెలిపారు.