సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నగరంలో ఓఫాంహోజ్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శివారులోని శామీర్‌పేట్‌లో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురు డాక్టర్లును శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు కూడా పోలీసుల తనిఖీలో పట్టబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని గజ్వేల్‌కు చెందిన డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు.
రేవ్‌పార్టీకి తీసుకువచ్చిన అమ్మాయిలకు ముందుగానే హెచ్‌ఐవీ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమాచారం. రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం ముందుగా పోలీసులకు అందడంతో పక్క వ్యూహంతో వారు నిర్వహించిన తనిఖీలో వీరు పట్టబడ్డారు. రేవ్‌పార్టీల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
రేవ్‌పార్టీలో మరోకోణం..
వ్యాపార విస్తరణను పెంచుకునేందుకు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్లకు అమ్మాయిలను సరఫర చేసినట్లు తెలిసింది. డాక్టర్లకు అమ్మాయిలను సరఫరా చేసి.. దాని ద్వారా లబ్ధిపొందాలనే దురుబుద్ధితో ఫార్మా కంపెనీ ఈ తతంగం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment