Sameerpet police station
-
శామీర్‌పేట రేవ్ పార్టీలో మరో కోణం
-
రిసార్ట్స్‌లో డాక్టర్ల రేవ్ పార్టీ
-
యువతులతో డాక్టర్ల రేవ్‌పార్టీ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నగరంలో ఓఫాంహోజ్లో జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శివారులోని శామీర్‌పేట్‌లో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురు డాక్టర్లును శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు కూడా పోలీసుల తనిఖీలో పట్టబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని గజ్వేల్‌కు చెందిన డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు. రేవ్‌పార్టీకి తీసుకువచ్చిన అమ్మాయిలకు ముందుగానే హెచ్ఐవీ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమాచారం. రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం ముందుగా పోలీసులకు అందడంతో పక్క వ్యూహంతో వారు నిర్వహించిన తనిఖీలో వీరు పట్టబడ్డారు. రేవ్‌పార్టీల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేవ్‌పార్టీలో మరోకోణం.. వ్యాపార విస్తరణను పెంచుకునేందుకు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్లకు అమ్మాయిలను సరఫర చేసినట్లు తెలిసింది. డాక్టర్లకు అమ్మాయిలను సరఫరా చేసి.. దాని ద్వారా లబ్ధిపొందాలనే దురుబుద్ధితో ఫార్మా కంపెనీ ఈ తతంగం చేసింది. -
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దొంగ సంతకాలతో ఫ్లాట్‌ను అమ్మిన కేసులో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుమీత్ సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శామీర్‌పేట పోలీసులు బుధవారం సుమీత్ సేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేట సీఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం... ప్రజయ్ హోమ్స్ మాజీ సీఎండీ లేటు చంద్రమోహన్‌రెడ్డి భార్య హైమావతీరెడ్డికి మజీద్‌పూర్ గ్రామ పరిధిలో ప్రజయ్ హోమ్స్‌లోని తన 429 గజాల ఫ్లాట్‌ను దొంగ సంతకాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని సుమిత్ సేన్, విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమలపై ఈ నెల 16 న శామీర్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన శామీర్‌పేట పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమిత్ సేన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా ఫోర్జరీ చేసినట్లు ఆధారాలు లభించడంతో మంగళవారం రాత్రి కోర్టులో హాజరు పరిచి జైలుకి పంపినట్లు శామీర్‌పేట సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. పరారీలో మరో నలుగురు... ఇదే కేసులో మరో నలుగురు నిందితులు విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
కారు స్కూటీ ఢీ- ఇద్దరి మృతి
శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా): వేగంగా వచ్చిన ఓ కారు స్కూటీని ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య తెలిపిన వివరాలు... చింతల్‌కు చెందిన రాజు (35)తోపాటు మరో వ్యక్తి (పేరు తెలియలేదు.. వయస్సు 48) స్కూటీ (టీఎస్07ఈఎల్0679)పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్‌పేట్ మండలంలోని కట్టమైసమ్మ దేవాలయం నుంచి రాజీవ్ రహదారిపైగల మూలమలుపు వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో నగరం నుంచి సిద్దిపేట్ వైపు వేగంగా వెళుతున్న ఓ కారు (నంబర్ టీఎస్ 02 ఈఎఫ్ 5188) మూలమలపు వద్దకు వచ్చిన స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శామీర్‌పేట్ పోలీసులు మృతిచెందిన వారిలో ఒకరు రాజుగా గుర్తించారు. కారును స్వాధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు. అనే వివరాలు తెలియరాలేదు.