శామీర్‌పేట్(రంగారెడ్డి జిల్లా): వేగంగా వచ్చిన ఓ కారు స్కూటీని ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య తెలిపిన వివరాలు... చింతల్‌కు చెందిన రాజు (35)తోపాటు మరో వ్యక్తి (పేరు తెలియలేదు.. వయస్సు 48) స్కూటీ (టీఎస్07ఈఎల్0679)పై మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో శామీర్‌పేట్ మండలంలోని కట్టమైసమ్మ దేవాలయం నుంచి రాజీవ్ రహదారిపైగల మూలమలుపు వద్దకు వస్తున్నారు.
ఈ క్రమంలో నగరం నుంచి సిద్దిపేట్ వైపు వేగంగా వెళుతున్న ఓ కారు (నంబర్ టీఎస్ 02 ఈఎఫ్ 5188) మూలమలపు వద్దకు వచ్చిన స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శామీర్‌పేట్ పోలీసులు మృతిచెందిన వారిలో ఒకరు రాజుగా గుర్తించారు. కారును స్వాధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు. అనే వివరాలు తెలియరాలేదు.
కారు స్కూటీ ఢీ- ఇద్దరి మృతి
Published Tue, Jun 23 2015 11:54 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM
Advertisement
Advertisement