
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్ నగర్‌లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈతతంగం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. జూలై మూడున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.