speeding car
-
ఆ కారుతో హాహాకారాలు..
యమునానగర్ : హరియాణాలోని యమునానగర్‌లో వేగంగా దూసుకెళ్లిన కారు ఓ సైక్లిస్ట్‌ను బైక్‌ను ఢీకొనడంతో పాటు ఆగిఉన్న కారును ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యమునానగర్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్నవారు ఘటనా ప్రాంతం నుంచి పరారయ్యారు. వేగంగా దూసుకొచ్చిన హోండా సిటీ కారు తొలుత ఓ సైకిల్‌ను ఆపై బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన నిలిపిఉంచిన కారునూ ఢీకొందని ప్రత్యక్ష సాక్షి బన్సీలాల్ వెల్లడించారు. అతివేగంతో ప్రమాదానికి కారణమైన కారులో ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి పాల్పడిన కారును సీజ్ చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అతివేగంతో ప్రయాణించిన కారు కొందరిని ఢీ కొన్న సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న తర్వాత కారు డ్రైవర్ పరారైనట్టు గుర్తించామని పోలీస్ ఇన్స్పెక్టర్ మెహల్ లాల్ తెలిపారు. కారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. కారులో హుక్కా లభించడంతో డ్రైవర్ డ్రగ్స్ మత్తులో వాహనం నడిపినట్టు తెలుస్తోందని అన్నారు. #WATCH Haryana: A speeding car hits a cycle, a motorcycle and a parked car on a road in Yamuna Nagar, 5 people injured. Police have begun investigation. (11.1.20) pic.twitter.com/b52Qz3whNQ — ANI (@ANI) January 12, 2020 -
ఆరేళ్ల చిన్నారిని ఢీ కొన్న కారు
-
సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్) : రోడ్డు దాటేటపుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అనుకోకుండా చేసే చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. ఆరేళ్లబాలిక మెయిన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్ నగర్‌లోని ఓ మెయిన్ రోడ్డును క్రాస్ చేయాలనుకున్న బాలికను ప్రమాదవశాత్తూ కారు ఢీకొట్టింది. మెయిన్ రోడ్డు సగం క్రాస్ చేసిన బాలిక అనంతరం డివైడర్‌ను దాటి రోడ్డు అవతలి వైపు వెళ్లడానికి ప్రయత్నించగా, వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలిక గాల్లో ఎగిరి దూరంలో పడిపోయింది. బాలికకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈతతంగం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. జూలై మూడున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
కాసేపట్లో సివిల్స్ పరీక్ష.. అంతలో ప్రమాదం
న్యూఢిల్లీ: మరి కొద్ది సేపట్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష. అప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ మొత్తాన్ని పరీక్షలో చూపాలన్న ఆరాటం. కానీ, ఆ సివిల్స్ ఆశావాహికి నిరాశ ఎదురైంది. ఆమెను దురదృష్టం కారు ప్రమాదం రూపంలో వెంటాడింది. పరీక్ష కోసం ఉదయాన్నే సిద్ధమై రోడ్డు దాటి పుట్ ఫాత్పై అడుగేస్తుండగానే వెనుక నుంచి ఓ కారు బలవంతంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆమె పరీక్ష హాలుకు బదులు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కవితా శర్మ అనే యువతి ఢిల్లీలో ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. ఆదివారం ఉదయం సివిల్స్ పరీక్ష ఉండటంతో అందుకు సిద్ధమై ఢిల్లీలోని తోడాపూర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటి ఫుట్‌పాత్‌పై అడుగుపెట్టబోయింది. ఇంతలోనే అనూహ్యంగా వేగంగా వచ్చిన హోండా సిటీ కారు ఢీకొట్టింది. పైగా ఆమెపైనే కేకలు వేస్తూ ఆ కారు డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. దీంతో సమీపంలోని స్థానికులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలి చీలమండలానికి తీవ్ర గాయం కాగా పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యాక్సిడెంట్ చేసిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.