కాసేపట్లో సివిల్స్ పరీక్ష.. అంతలో ప్రమాదం | IAS aspirant misses prelims after being hit by speeding car | Sakshi
Sakshi News home page

కాసేపట్లో సివిల్స్ పరీక్ష.. అంతలో ప్రమాదం

Published Mon, Aug 24 2015 2:40 PM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM

కాసేపట్లో సివిల్స్ పరీక్ష.. అంతలో ప్రమాదం - Sakshi

కాసేపట్లో సివిల్స్ పరీక్ష.. అంతలో ప్రమాదం

న్యూఢిల్లీ: మరి కొద్ది సేపట్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష. అప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ మొత్తాన్ని పరీక్షలో చూపాలన్న ఆరాటం. కానీ, ఆ సివిల్స్ ఆశావాహికి నిరాశ ఎదురైంది. ఆమెను దురదృష్టం కారు ప్రమాదం రూపంలో వెంటాడింది. పరీక్ష కోసం ఉదయాన్నే సిద్ధమై రోడ్డు దాటి పుట్ ఫాత్పై అడుగేస్తుండగానే వెనుక నుంచి ఓ కారు బలవంతంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆమె పరీక్ష హాలుకు బదులు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్కు చెందిన కవితా శర్మ అనే యువతి ఢిల్లీలో ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతుంది.

ఆదివారం ఉదయం సివిల్స్ పరీక్ష ఉండటంతో అందుకు సిద్ధమై ఢిల్లీలోని తోడాపూర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటి ఫుట్పాత్పై అడుగుపెట్టబోయింది. ఇంతలోనే అనూహ్యంగా వేగంగా వచ్చిన హోండా సిటీ కారు ఢీకొట్టింది. పైగా ఆమెపైనే కేకలు వేస్తూ ఆ కారు డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. దీంతో సమీపంలోని స్థానికులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలి చీలమండలానికి తీవ్ర గాయం కాగా పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యాక్సిడెంట్ చేసిన కారును, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement