బీహార్లోని ముజఫర్పూర్లో మత ఘర్షణలు చెలరేగాయి. అజీజ్‌పూర్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
ముజఫర్పూర్ : బీహార్లోని ముజఫర్పూర్లో మత ఘర్షణలు చెలరేగాయి. అజీజ్‌పూర్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి 14మందిని అరెస్ట్ చేసినట్లు ముజఫర్ పూర్ డీఎం అనుపమ్ కుమార్ తెలిపారు. పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి కుటుంబాలకు జిల్లా అధికారులు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే ఓ వర్గానికి చెందిన యువతి...మరో వర్గానికి చెందిన యువకుడితో వెళ్లిపోయింది. అయితే ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. దాంతో ఆగ్రహించిన మృతుని బంధువులు, గ్రామస్తులు అజీజ్పూర్పై దాడి చేసి, ఇళ్లకు నిప్పుపెట్టి...పలు వాహనాలను ధ్వంసం చేశారు.