ఇబ్రహీంపట్నం: గాయపడిన బాధితులు
సాక్షి, భువనగిరి క్రైం: ఒకచోట పెళ్లి విందులో మటన్ ముక్కల విషయమై గొడవ.., మరొకచోట వివాహానంతరం బారాత్ సమయంలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం కడీలబాయి తండాకు చెందిన యువతితో చండూరు మండలం సర్వయితండాకు చెందిన యువకుడి వివాహం గురువారం ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. కాగా పెళ్లి తర్వాత ఇచ్చిన విందులో మాంసం కూర వడ్డించే క్రమంలో వివాదం మొద లైంది.
అదికాస్తా ముదరడంతో అమ్మాయి, అబ్బా యి తరఫు వారు ఘర్షణకు దిగి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండువర్గాల బంధువులు ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద కూడా గొడ వపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిలో ఉన్న ఓ సర్పంచ్‌పై ఎస్‌ఐ వెంకటేశ్ అనుచితంగా ప్రవర్తించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏసీపీ ఉమామహేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశారు.
ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ అబ్బా యి వివాహం భువనగిరికి చెందిన అమ్మాయితో పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగింది. పెళ్లి అనంతరం బారాత్‌లో డీజే పాటలతో డ్యాన్స్ చేస్తున్న క్రమంలో వివాదం తలెత్తింది. ఇరువర్గాల బంధువులు తమకు నచ్చిన పాటే పెట్టాలని ఒకరినొకరు తోసుకున్నారు. కాసే పటి తర్వాత అబ్బాయి తరఫు వారు బస్సులోకి ఎక్కేందుకు వెళ్లగా అక్కడ వేచి ఉన్న అమ్మాయి తరఫు వారు ఇటుకలతో దాడి చేశారు. దీంతో కూరడి ఈశ్వర్, దొంతరబోయిన స్వామిశేఖర్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కర్రలతో దాడి చేయడంతో అబ్బాయి తరఫు వారి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి.
చదవండి: Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్‌పై వెళ్తుండగా
Comments
Please login to add a commentAdd a comment