కొత్త నోట్లు, కారు కట్నంగా ఇవ్వలేదని.. | He demanded a car and new currency notes for marriage | Sakshi
Sakshi News home page

కొత్త నోట్లు, కారు కట్నంగా ఇవ్వలేదని..

Published Sat, Nov 26 2016 8:47 AM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM

కొత్త నోట్లు, కారు కట్నంగా ఇవ్వలేదని.. - Sakshi

కొత్త నోట్లు, కారు కట్నంగా ఇవ్వలేదని..

ముజఫర్‌నగర్‌: పెద్దనోట్ల రద్దుతో పెళ్లిళ్లు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లిల సీజన్‌లో ఉరుములేని పిడుగులా విరుచుకుపడిన పెద్దనోట్ల రద్దు ప్రభావంతో చాలా వివాహాలపై ఈ ప్రభావం పడింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోనూ ఓ వివాహం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. కొత్త నోట్లు, కారు కట్నంగా ఇస్తేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, లేకుంటే తాళి కట్టే ప్రసక్తే లేదని పెళ్లికి ఒక రోజు ముందు వరుడు మొండికేశాడు.

పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి.. పిండివంటలను సిద్ధంచేసి బంధువులను ఇంటికి పిలిచి.. తెల్లారే వివాహానికి సిద్ధమవుతుండగా వరుడు ఈ విధంగా షాక్‌ ఇవ్వడంతో వధువు కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. కారు, కొత్త నోట్లు కట్నంగా ఇవ్వాలని వరుడు డిమాండ్‌ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని వరుడు ముందే షరతు పెట్టాడని, పెద్దనోట్ల రద్దుతో వాటిని తాము సమకూర్చకపోవడంతో పెళ్లిపీటలు ఎక్కనని వరుడు మొండికేస్తున్నాడని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement