కన్న తండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని కెనాల్లో పడవేశాడు ఓ యువకుడు.
ముజఫర్ నగర్: కన్న తండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని కెనాల్లో పడవేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్సోలీ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..మెహెర్భాన్(60) తన 23 ఏళ్ల కుమారుడు మోహిసిన్ మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహర్భాన్ జనవరి9 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆదివారం మోహిసిన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత తనకు ఏమితెలియదని మోహిసిన్ బుకాయించాడు. అయితే పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో అసలు నిజం బయటకు తెలిసింది. తన స్నేహితులతో కలిసి తండ్రిని హతమార్చి గంగానది కెనాల్లో పడవేసినట్టు మోహిసిన్ ఒప్పుకున్నాడు. దీంతో కెనాల్ నుంచి మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.