![Woman Son In law Elope For Marriage Arrested By Police In Utterpradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/2/shadow-image.jpg.webp?itok=DSDAiKbS)
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: సమాజంలో రోజు రోజుకీ విలువలు పతనమవుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిండు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. అత్త, అల్లుడు పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని మధుభార్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. 50 ఏళ్ల మహిళ ఒకరు పాతికేళ్ల వయసున్న తన సొంత అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే వీరి సంబంధం గురించి తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో 10 నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే 10 నెలల క్రితం పారిపోయిన వీరిద్దరూ బుదవారం ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు వివాహం జరిగిన విషయం తెలియజేశారు. తామిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే ఇందుకు కుటుం సభ్యులు అంగీకరించలేదు. దీంతో అక్కడ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ జంటను అరెస్టు చేశారు. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో.. అత్త, అల్లుడి అక్రమ సంబంధంపై నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment