![Muzaffarnagar Police Pays Tribute To Super Cop Dog Tinky - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/11/dog.jpg.webp?itok=dvNhqER9)
సాహస శునకానికి విగ్రహం
‘ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది’ అంటారు. రోజు సంగతి సరే, విగ్రహాల గురించి కూడా మాట్లాడుకోవాలి. విశ్వాసానికి మారు పేరు శునకాలు అంటారు. మనుషులకు మాత్రమే కాదు మంచికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన శునకాలకు సైతం విగ్రహాలు ఉండాలి అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు.
ప్రతి కుక్కకు కాకపోయినా ప్రత్యేకమైన కుక్కకు ఒక విగ్రహం తప్పకుండా ఉంటుందని తాజాగా నిరూపించారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. ముజఫర్‌నగర్ డాగ్‌స్క్వాడ్‌లోని ఆ శునకం పేరు ఏఎస్పీ టింకీ. 49 కేసులను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించిన టింకి గత సంవత్సరం నవంబర్‌లో చనిపోయింది. ఈ శునకానికి నివాళి అర్పిస్తూ పోలీస్‌లైన్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టింకీ పర్యవేక్షకుడు సునీల్ కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment