
’సల్మాన్ ఖాన్ 20 కోట్లు ఇస్తానన్నాడు’
’సుల్తాన్’ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, నిర్మాత యశ్రాజ్ ఫిలిమ్స్, దర్శకుడు అలీ అబ్బాస్ పై బిహార్ లో ఛీటింగ్ కేసు నమోదైంది.
ముజాఫర్పూర్: ’సుల్తాన్’ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, నిర్మాత యశ్రాజ్ ఫిలిమ్స్, దర్శకుడు అలీ అబ్బాస్ పై బిహార్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. ముజాఫర్పూర్ కు చెందిన సబీర్ అన్సారీ అనే వ్యక్తి సీజేఎం కోర్టులో ఈ కేసు పెట్టాడు. సుల్తాన్’ సినిమా తన జీవిత కథ ఆధారంగా తీశారని ఆరోపించాడు. తన కథతో సినిమా తీసినందుకు సల్మాన్ ఖాన్ రూ.20 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని వెల్లడించాడు. సినిమా విడుదలైన తర్వాత కూడా తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని తెలిపాడు.
తన కథతో సినిమా కోసం సల్మాన్ పలుమార్లు తనను సంప్రదించాడని చెప్పారు. అయితే తన జీవితంగా ఆధారంగా సినిమా తీయడం లేదని కొద్దిరోజుల తర్వాత తనకు సల్మాన్ చెప్పాడన్నారు. తనను మోసం చేసి సినిమా తీశారని ఆరోపించాడు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు జూలై 12కు వాయిదా వేసింది.