ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు అప్పుడే నోటికి పని చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఆవుల విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైనా ఆవులను కించపరిచినా.. వాటిని చంపినా కాళ్లు విరగ్గొడతా' అని ఆయన హెచ్చరించారు