
యూపీ జైలులో 32 మంది హిందువుల ఉపవాసాలు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జైలులో ముస్లింలతో పాటు 32 మంది హిందూ ఖైదీలు కూడా ఉపవాస దీక్ష చేపట్టారు. ‘రోజా’ పాటిస్తున్న ఖైదీల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇఫ్తార్ విందులో భాగంగా పాలు, డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ రాకేశ్ సింగ్ చెప్పారు. జైలులో ఉన్న మొత్తం 2,600 మంది ఖైదీల్లో 1174 మంది ముస్లింలు, 32 మంది హిందువులు రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసాలుంటున్నారు.