విశాలమైన పచ్చిక మైదానం.. అందులో వివిధ భంగిమల్లో కూర్చున్న యువజనం.. ఏ ఒక్కరికీ ఒంటినిండా దుస్తుల్లేవు. అందరికందరూ అండర్ వేర్లలో ఉన్నారు. చేతుల్లో పెన్ను, పేపర్లతో తెగరాసేస్తున్నారు. ఇదేదో గిన్నిస్ రికార్డు ఫీట్ లా ఉందనుకుని కాసేపుగమనించిన తర్వాతగానీ అప్పుడే అక్కడికి వెళ్లినవాళ్లకు అర్థంకాలేదు.. అదో అసలు సిసలు ఆర్మీ పరీక్ష అని!బిహార్ లోని ముజఫర్ పూర్ లో సోమవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులను చొక్కాలు, ప్యాంట్లు విప్పిన తర్వాతే అనుమతించారు అధికారులు. గత నెల నిర్వహించిన ఫిజికల్ టెస్ట్ లో మొత్తం 11 వేల మంది అభ్యర్థులు రిటన్ పరీక్షకు అర్హత సాధించారు. ఎంత ఆర్మీ పరీక్షైతే మాత్రం మరీ బట్టలిప్పించాలా? అనుకునేముందు అది బిహార్ అని మరోసారి గుర్తుచేసుకోవాలి మనం. పరీక్షల్లో కాపీ కొట్టడంలో ప్రపంచానికే పాఠాలు నేర్పిన చరిత్ర బిహారీలది. అయితే ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చూచిరాతకు తావివ్వకూడదనుకున్న అధికారులు అభ్యర్థుల పరువును పణంగాపెట్టి ఇంతటిఘనకార్యం చేశారు.