నాడు అత్యాచారం చేసిన నిందితులే... నేడు | In Muzzafarnagar, Rape Survivor Shot at | Sakshi
Sakshi News home page

నాడు అత్యాచారం చేసిన నిందితులే... నేడు

Published Sun, Sep 14 2014 5:19 PM | Last Updated on Tue, Oct 16 2018 8:23 PM

నాడు అత్యాచారం చేసిన నిందితులే... నేడు - Sakshi

నాడు అత్యాచారం చేసిన నిందితులే... నేడు

ముజఫర్నగర్: గతే ఏడాది సామూహిక అత్యాచారానికి గురైన యువతిని ముగ్గురు యువకులు బైక్పై వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారైయ్యారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో జనక్పూరి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆగంతకుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ యువతిని స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారని... అప్పటికే ఆ యువతి మరణించిందని డిఎస్పీ సంజీవ్ కుమార్ వాజపేయ్ తెలిపారు.

గతంలో సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను అరెస్ట్ చేశామని... వారు ఇటీవల బెయిల్పై జైలు నుంచి విడుదలైయ్యారని సంజీవ్ వెల్లడించారు. ఈ హత్యకు పాల్పడింది ఆ నిందితులేనని అనుమానిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు సంజీవ్ కుమార్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement