Janakpuri locality
-
‘అయోధ్య టు జనక్‌పూర్’ ప్రత్యేకత ఏమిటంటే..
రామ జన్మభూమి అయోధ్య నుంచి సీతామాత జన్మస్థలం జనక్‌పూర్‌కు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శ్రీరాముడు కొలువైన అయోధ్య నుండి గోరక్ష నగరం మీదుగా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు అంటే సీతామాత జన్మస్థలానికి ప్రత్యేక రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశం నుండి నేరుగా నేపాల్‌కు వెళ్లే మొదటి రైలు ఇదేకానుంది. ఈ రైలును రైల్వేశాఖ, ఐఆర్సీటీసీ సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి.ఈ రైలు అయోధ్యలో ప్రయాణాన్ని ప్రారంభించి, గోరఖ్‌పూర్ మీదుగా వివిధ మార్గాల గుండా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు చేరుకోనుంది. ఈ రైలు అయోధ్య నుంచి జనక్‌పూర్ చేరుకునేందుకు 22 గంటల సమయం పడుతుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. సెకండ్, థర్డ్ ఏసీలే కాకుండా స్లీపర్, జనరల్ కోచ్‌లు కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రైలును వారానికి ఒకసారి నడపాలని, ప్రయాణికుల స్పందన చూశాక మిగతా రోజుల్లో కూడా నడపాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ఈ రైలు అయోధ్య నుండి బయలుదేరి గోరఖ్‌పూర్, నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా మీదుగా జనక్‌పూర్ చేరుకుంటుంది. -
ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. #WATCH | A large portion of road caved in Delhi's Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix — ANI (@ANI) July 5, 2023 అంతకుముందు మే 3న ఢిల్లీ ఖురేజీ ఖాస్ కేవ్స్ వద్ద, మార్చి 31న ప్రెస్ ఎన్ క్లేవ్ రహదారిపై హౌజ్ రాణి రెడ్ లైట్ ప్రాంతం వద్ద కూడా ఇదేవిధంగా రోడ్లు కుంగిపోయిన సంఘటనలు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోనే మూడుసార్లు రోడ్లు కుంగిపోయిన సంఘటనలు ఢిల్లీ అధికారులను కలవర పెడుతున్నాయి. ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
నాడు అత్యాచారం చేసిన నిందితులే... నేడు
ముజఫర్‌నగర్: గతే ఏడాది సామూహిక అత్యాచారానికి గురైన యువతిని ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారైయ్యారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జనక్‌పూరి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆగంతకుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ యువతిని స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారని... అప్పటికే ఆ యువతి మరణించిందని డిఎస్పీ సంజీవ్ కుమార్ వాజపేయ్ తెలిపారు. గతంలో సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను అరెస్ట్ చేశామని... వారు ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదలైయ్యారని సంజీవ్ వెల్లడించారు. ఈ హత్యకు పాల్పడింది ఆ నిందితులేనని అనుమానిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు సంజీవ్ కుమార్ వివరించారు.