రామ జన్మభూమి అయోధ్య నుంచి సీతామాత జన్మస్థలం జనక్‌పూర్‌కు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శ్రీరాముడు కొలువైన అయోధ్య నుండి గోరక్ష నగరం మీదుగా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు అంటే సీతామాత జన్మస్థలానికి ప్రత్యేక రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశం నుండి నేరుగా నేపాల్‌కు వెళ్లే మొదటి రైలు ఇదేకానుంది. ఈ రైలును రైల్వేశాఖ, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి.
ఈ రైలు అయోధ్యలో ప్రయాణాన్ని ప్రారంభించి, గోరఖ్‌పూర్ మీదుగా వివిధ మార్గాల గుండా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు చేరుకోనుంది. ఈ రైలు అయోధ్య నుంచి జనక్‌పూర్ చేరుకునేందుకు 22 గంటల సమయం పడుతుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. సెకండ్, థర్డ్ ఏసీలే కాకుండా స్లీపర్, జనరల్ కోచ్‌లు కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రైలును వారానికి ఒకసారి నడపాలని, ప్రయాణికుల స్పందన చూశాక మిగతా రోజుల్లో కూడా నడపాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ఈ రైలు అయోధ్య నుండి బయలుదేరి గోరఖ్‌పూర్, నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా మీదుగా జనక్‌పూర్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment