Janakpuri
-
‘అయోధ్య టు జనక్‌పూర్’ ప్రత్యేకత ఏమిటంటే..
రామ జన్మభూమి అయోధ్య నుంచి సీతామాత జన్మస్థలం జనక్‌పూర్‌కు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శ్రీరాముడు కొలువైన అయోధ్య నుండి గోరక్ష నగరం మీదుగా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు అంటే సీతామాత జన్మస్థలానికి ప్రత్యేక రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశం నుండి నేరుగా నేపాల్‌కు వెళ్లే మొదటి రైలు ఇదేకానుంది. ఈ రైలును రైల్వేశాఖ, ఐఆర్సీటీసీ సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి.ఈ రైలు అయోధ్యలో ప్రయాణాన్ని ప్రారంభించి, గోరఖ్‌పూర్ మీదుగా వివిధ మార్గాల గుండా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు చేరుకోనుంది. ఈ రైలు అయోధ్య నుంచి జనక్‌పూర్ చేరుకునేందుకు 22 గంటల సమయం పడుతుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. సెకండ్, థర్డ్ ఏసీలే కాకుండా స్లీపర్, జనరల్ కోచ్‌లు కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రైలును వారానికి ఒకసారి నడపాలని, ప్రయాణికుల స్పందన చూశాక మిగతా రోజుల్లో కూడా నడపాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ఈ రైలు అయోధ్య నుండి బయలుదేరి గోరఖ్‌పూర్, నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా మీదుగా జనక్‌పూర్ చేరుకుంటుంది. -
ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. #WATCH | A large portion of road caved in Delhi's Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix — ANI (@ANI) July 5, 2023 అంతకుముందు మే 3న ఢిల్లీ ఖురేజీ ఖాస్ కేవ్స్ వద్ద, మార్చి 31న ప్రెస్ ఎన్ క్లేవ్ రహదారిపై హౌజ్ రాణి రెడ్ లైట్ ప్రాంతం వద్ద కూడా ఇదేవిధంగా రోడ్లు కుంగిపోయిన సంఘటనలు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోనే మూడుసార్లు రోడ్లు కుంగిపోయిన సంఘటనలు ఢిల్లీ అధికారులను కలవర పెడుతున్నాయి. ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
పెళ్లికొచ్చి భోజనం బాగోలేదని..
-
సిబ్బందిని చితక్కొట్టిన అతిథులు!
న్యూఢిల్లీ : రుచికరమైన భోజనం వడ్డించలేదనే కారణంతో పెళ్లికొచ్చిన అతిథులు హోటల్ సిబ్బందిని చితక్కొట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. జనక్‌పురిలోని పికాడిలీ హోటల్లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు సరిగాలేవనే కారణంతో పెళ్లి అతిథులు హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం భోజనం రుచికరంగా లేదంటూ వారిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ ఫర్నీచర్ సహా ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
కమలం కంచుకోటకు బీటలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీకి తలమానికమైన జనక్‌పురిని బీజేపీకికంచుకోటగా పేర్కొంటారు. ఆ పార్టీ సీనియర్ నేత జగ్దీశ్ముఖి ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ముఖిని ఓడించడం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. అయితే ఆ పార్టీ బరిలోకి దించినఅభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖి కంచుకోటకు బీటలు బారిందనే విషయం గత ఎన్నికల్లోనేస్పష్టమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాజేష్ రుషి గత ఎన్నికల్లో ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 2,644 ఓట్ల ఆధిక్యంతో ముఖి గెలుపొందారు. ఈసారి కూడా ఆప్ రుషినే బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ముఖి అల్లుడు సురేష్ కుమార్‌ను బరిలోకి దించింది. మామా అల్లుళ్ల పోరుపై జనక్‌పురి వాసులే కాకుండా ఢిల్లీవాసులు కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన అనంతరం ముఖ్యమంత్రి పీఠం జగ్దీశ్ ముఖికి కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఊహాగాపాలు వినిపించాయి. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి ముఖి త నవంతు ప్రయత్నం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వర్సెస్ ముఖి పోస్టర్లతో కొన్నాళ్లు ప్రచారం కూడా చేసింది. అయితే తాజాగా కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో సీఎంపై ముఖి ఆశలు కల్లలేనని తేలిపోయింది. కిరణ్ బేడీ సీఎం అభ్యర్థిత్వంపై ముఖి తన అసంతృప్త్తిని అధిష్టానానికి సూచనప్రాయంగా వ్యక్తం చేసినప్పటికీ చివరికి పార్టీ ఆదేశాన్ని శిరసావహించారు. ఒకప్పుడు జనక్‌పురిని కాలనీ ఆఫ్ పార్క్స్ అనేవారు. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అనధికార కాలనీలను కూడా ఇందులో చేర్చడంతో ఈ నియోజకవర్గంలో ఓటర్ల నేపథ్యం మారిపోయింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.70 లక్షలు. అందులోనూ పంజాబీ ఓటర్లు ఎక్కువ. ఇక రెండో స్థానంలో సిక్కులు, మూడోస్థానంలో పూర్వాంచలీయులు ఉన్నారు. -
ఏఈఎస్ జనక్‌పురిలో ఘనంగా పేరెంట్స్‌డే వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర విద్యాసంఘం (ఏఈఎస్) ఎన్టీ రామారావు సీనియర్ సెకండరీ పాఠశాల ప్రాథమిక విద్యార్థుల పేరెంట్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. చిన్నారులు, వారి తల్లిదండ్రులేగాక వారి తల్లిదండ్రులూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలను సత్కరించడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అచ్చతెలుగు నుంచి హాలీవుడ్ వరకు విభిన్న భాషల పాటలకు పిల్లలు ఆడిపాడిన తీరు అందరినీ అలరించింది. తమ చిన్నారుల ఆటపాటలను చూపి పెద్దలు మురిసిపోగా, తమ పెద్దలకు జరుగుతున్న సత్కారాన్ని పిల్లలు ఆసక్తిగా తిలకించారు. పిల్లలలో దాగిన ప్రతిభను వెలికితీసే ఉద్దేశం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ అనిత స్వాగతోపన్యాసంలో చె ప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఈఎస్ కార్యదర్శి ఈశ్వరప్రసాద్ మాట్లాడుతూ పట్టుదల, దీక్షతో ప్రయత్నిస్తే సాధించలేనిది లేదని పిల్లలకు హితవు చెప్పారు. చిన్నారుల అభ్యున్నతిలో తల్లిదండ్రుల సహకారం కీలకమైనదని చెబుతూ, ఆయన ఈ మేరకు కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. పేరెం ట్స్డేను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రాం డ్ పేరెంట్స్‌ను సత్కరిస్తున్నట్లు పాఠశాల మేనేజర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఓం నమో గణేశా’ కూచి పూడి నృత్యం, లుంగీడ్యాన్స్ పాటకు చిన్నారులు ఉత్సాహంగా ప్రదర్శించిన నృత్యాలు, ‘రఘుపతి రాఘవ రాజారామ్’ గీతానికి దేశభక్తిని ప్రదర్శిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
పేరు కోసం నిధుల వృథా
ఎలాగైనా మరోసారి గెలుపొందాలనే ఆతృతతో ఉన్న ప్రజానిధులు హడావుడిగా ప్రాజెక్టులు ప్రారంభిస్తూ నిధులు వృథా చేస్తున్నారు. కొంతమంది కౌన్సిలర్లు గేట్ల నిర్మాణం కోసమే లక్షలాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నవంబర్ నెలాఖరులోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలన్నింటినీ అందంగా చూపించేందుకు చకచకా పనులు మొదలుపెడుతున్నారు. ఇందుకు ఎమ్మెల్యేల స్థానికప్రాంతాల అభివృద్ధి నిధులను వ్యయం చేస్తున్నారు. ఉదాహరణ కావాలంటే బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ ముఖి నియోజకవర్గంలో చూడండి. జనక్‌పురి సీ2 బ్లాక్‌లోని ఐదుచోట్ల అందమైన గేట్లను నిర్మించారు. ఇవన్నీ గత ఆరు నెలల్లోపే వెలిశాయి. దురదృష్టవశాత్తూ స్థానికులు మాత్రం ముఖి ప్రయత్నాలపై పెదవి విరుస్తున్నారు. గేట్ల నిర్మాణం వల్ల నిధుల వృథా తప్ప తమకు ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. ‘మా కాలనీలోని ప్రవేశ, నిష్ర్కమణ ప్రాంతాల్లో ఇది వరకే ఇనుపగేట్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఈ ఐదు గేట్లను నిర్మించింది. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడం మినహా మరేమీ కాదు. ఈ గేట్లతో మాకు ఎలాంటి ఉపయోగమూ లేదు’ అని సీ2 నివాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుల్షన్రాయ్ అన్నారు. జగదీశ్ ముఖి మాత్రం ఇలాంటి వాదనలతో విభేదిస్తున్నారు. ‘జనక్‌పురి వార్డులో ఇది వరకే అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అందమైన గేట్లతోపాటు వీధిదీపాలు, స్కేటింగ్‌రింగ్ వంటివి ఏర్పాటు చేశాం. నేను గత 33 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాను’ అని వివరించారు. జనక్‌పురి వ్యాప్తంగా 50 గేట్లు నిర్మించామని తెలిపారు. ఒక్కో గేటుకు రూ.2-7 లక్షల దాకా వ్యయం చేశామని, అన్ని గేట్లపైనా ముఖి ఫొటో ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున నిధులను త్వరగా ఖర్చు (వృథా అని చదువుకోండి) చేయడానికి ప్రజాప్రతినిధులు గేట్ల వంటి అలంకరణలపై ఆసక్తి చూపిస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. రాజోరీగార్డెన్లోనూ ఇలా ఐదుగేట్లను నిర్మించారు. అన్నింటిపైనా స్థానిక కౌన్సిలర్ సుభాష్ ఆర్య ఫొటోలు కనిపిస్తున్నాయి. వీటి పునాదులపై కౌన్సిలర్లు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు ఈ విషయమై కేంద్ర సమాచార కమిషన్‌కు వివరణ ఇస్తూ ప్రాజెక్టులపై సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లను ఉంచకూడదనే నియమం ఏదీ ఢిల్లీ మున్సిపల్ చట్టంలో లేదని తెలిపారు. గేట్ల వంటి వ్యర్థ ప్రాజెక్టుల కోసం భారీగా నిధుల కేటాయింపును మున్సిపల్ కార్పొరేషన్లు అడ్డుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాజోరీగార్డెన్‌లో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా, ఎందుకూ పనికిరాని గేట్లకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయించడం సరికాదని సమాచార హక్కు చట్టం కార్యకర్త ముకేశ్సూద్ అన్నారు. ఆర్య రాజోరీగార్డెన్ స్థానం నుంచి పోటీకి బీజేపీ టికెట్‌కు కూడా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాంతాలు అందంగా కనిపించడానికి గేట్లు నిర్మిస్తే తప్పేమిటన్నది ఆయన ప్రశ్న.