సిబ్బందిని చితక్కొట్టిన అతిథులు! | Delhi Wedding Guests Beat Up Hotel Staff | Sakshi
Sakshi News home page

సిబ్బందిని చితక్కొట్టిన అతిథులు!

Published Tue, Feb 12 2019 6:44 PM | Last Updated on Tue, Feb 12 2019 7:28 PM

Delhi Wedding Guests Beat Up Hotel Staff - Sakshi

న్యూఢిల్లీ : రుచికరమైన భోజనం వడ్డించలేదనే కారణంతో పెళ్లికొచ్చిన అతిథులు హోటల్‌ సిబ్బందిని చితక్కొట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. జనక్‌పురిలోని పికాడిలీ హోటల్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు సరిగాలేవనే కారణంతో పెళ్లి అతిథులు హోటల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం భోజనం రుచికరంగా లేదంటూ వారిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘటనలో హోటల్‌ ఫర్నీచర్‌ సహా ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement