గన్తో బెదిరించి మైనర్ పై అత్యాచారం | Youth rapes minor girl at gun-point | Sakshi
Sakshi News home page

గన్తో బెదిరించి మైనర్ పై అత్యాచారం

Published Thu, Feb 5 2015 1:04 PM | Last Updated on Tue, Aug 21 2018 3:18 PM

గన్తో బెదిరించి మైనర్ పై అత్యాచారం - Sakshi

గన్తో బెదిరించి మైనర్ పై అత్యాచారం

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లోని బొపా గ్రామంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు 15 ఏళ్ల బాలికను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. బాధితురాలు ఈ దారుణాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించామని ... అయితే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement