ఆగని అత్యాచార పర్వం
ముజఫర్నగర్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు యువకులు ఓ యువతిని నమ్మించి, పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువతిపై యోగేశ్ కుమార్, బబ్లు అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
అత్యాచారాన్ని ఫోన్లో రికార్డు చేశారు. అనంతరం ఫోన్ నుంచి వీడియో తొలగిస్తానని చెప్పి యోగేశ్ కుమార్ ఆ యువతిపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకపోగా, మరిన్ని బెదిరింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలో..
20 ఏళ్ల యువతిపై కదులుతున్న రైల్లో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి లక్నో–ముంబై పుష్ఫక్ ఎక్స్ప్రెస్ రైలు ఇగత్పురి, కసర స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి సమయంలో రైలు ఘాట్ మార్గంలో ప్రయాణిస్తుండగా అత్యాచారం జరిగిందన్నారు.
కర్ణాటకలో...
దక్షిణ కన్నడ జిల్లా బంటా్వళ తాలూకాలో మైనర్ బాలికకు మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో మైనర్ బాలిక (16) స్కూల్కు నడిచి వెళ్తుండగా తెల్లని కారులో వచి్చన దుండగులు బాలికను అపహరించారు. దూరంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి మత్తు పానీయం తాగించి మూకుమ్మడిగా లైంగికదాడి చేసి అక్కడికి దగ్గరలో వదిలేసి వెళ్లారు. కొంతసేపటికి మత్తు నుంచి తేరుకున్న నేరుగా స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి ఈ ఘోరం గురించి ఫిర్యాదు చేసింది. ఐదుమంది అత్యాచారం చేశారని, వారి పేర్లను కూడా వెల్లడించింది.
జార్ఖండ్లో..
జార్ఖండ్లో 14 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల వృద్ధుడు గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సిండేగా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తండ్రి కేరళలో పని చేస్తుండగా, తల్లి ఉదయాన్నే పనులకు వెళుతుంది. ఇంటి పక్కనే నివసిస్తున్న వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బాలిక తన తల్లికి తెలియజేయగా ఆమె పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు.
పశ్చిమబెంగాల్లో...
పశ్చిమబెంగాల్ పూర్బ బర్దమాన్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిం ది. బస్స్టాండ్ వద్ద వేచి చూస్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు కలసి ఆమెను అపహరించి అత్యాచారం చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.