
జంట అదృశ్యం.. యువకుడి తండ్రి హత్య
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలిక అదృశ్యానికి కారణమయ్యాడంటూ ఓ యువకుడిపై ఆగ్రహంతో అతడి తండ్రిని దారుణంగా కొట్టి చంపారు.
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలిక అదృశ్యానికి కారణమయ్యాడంటూ ఓ యువకుడిపై ఆగ్రహంతో అతడి తండ్రిని దారుణంగా కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లా రసూల్ గ్రామంలో ఈ ఘోరం ఈ ఘటన చోటుచేసుకుంది. రసూల్ గ్రామానికి చెందిన షకీర్ కుమారుడు అబ్దుల్, రియాసత్ అనే వ్యక్తి కుమార్తె ఈ నెల 3న ఎవరికి చెప్పకుండా పారిపోయారు.
దీంతో రియాసత్ కుటుంబీకులు షకీర్‌పై ఆగ్రహంతో ఉన్నారు. వారం రోజులు గడిచినా జాడ తెలియకపోవటంతో ఈ నెల 11న షకీర్‌ను అపహరించారు. అనంతరం కొట్టి చంపారు. దీంతో మృతుని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రియాసత్‌తోపాటు ఆరుగురిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో బందోబస్తు పటిష్టం చేశారు.