మోదీజీ అతడ్ని కఠినంగా శిక్షించండి! | College Student writes letter to Pm Modi demands for action | Sakshi
Sakshi News home page

మోదీజీ అతడ్ని కఠినంగా శిక్షించండి!

Published Wed, Sep 20 2017 12:20 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

మోదీజీ అతడ్ని కఠినంగా శిక్షించండి! - Sakshi

మోదీజీ అతడ్ని కఠినంగా శిక్షించండి!

  • న్యాయం చేయాలంటూ ప్రధానికి విద్యార్థిని లేఖ
  • సాక్షి, లక్నో : బీజేపీ పాలితరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనూ మహిళలపై అరాచకాలు తగ్గడం లేదు. రోజు ఏదో ఓ మూల బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కాలేజీ విద్యార్థిని తన ఆవేదను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తనను రక్షించాలని కోరుతూ ప్రధానికి ఓ యువతి మోదీకి లేఖ రాశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముజఫర్ నగర్‌కు చెందిన ఓ కాలేజీ విద్యార్థినిని గత ఏడాది కాలం నుంచి ఓ ఆకతాయి వేధింపులకు గురిచేస్తున్నాడు.

    ఎన్నోసార్లు చెప్పి చూసినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. తనకు న్యాయం చేయాలని, తనను వేధిస్తోన్న యువకుడిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ మోదీకి బాధిత విద్యార్థిని ఓ లేఖ రాశారు. ఏడాది నుంచి తనవెంట పడి ఓ యువకుడు వేధిస్తున్నాడని, ఇంటి నుంచి బయటకు రావాలంటే భయమేస్తుందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఎలాగైనా తనను వేధిస్తున్న యువకుడిపై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ లేఖపై యూపీ అధికారులు స్పందించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement