అత్యాచారాన్ని అడ్డుకున్నారని... కాల్చి పారేశారు | Youths attempt to rape girl, shoot at two family members | Sakshi
Sakshi News home page

అత్యాచారాన్ని అడ్డుకున్నారని... కాల్చి పారేశారు

Published Thu, Jun 25 2015 1:24 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

అత్యాచారాన్ని అడ్డుకున్నారని... కాల్చి పారేశారు - Sakshi

అత్యాచారాన్ని అడ్డుకున్నారని... కాల్చి పారేశారు

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా దివాల్ గ్రామంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. పోలం పనులను వచ్చిన యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న సదరు యువతి బంధువులైన దంపతులు... యువకులను అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన యువకులు ఆ దంపతులుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

స్థానికుల సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి యత్నించిన నలుగురు నిందితులు షంషేర్ అలీ, జావేద్, ఖలీద్, చమన్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు ఇద్దరు యువతికి అత్తయ్య, మామయ్య అవుతారని పోలీసలు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement