
అసభ్యతకు నో అందని యువకుడి దుశ్చర్య
తన వేధింపులను అడ్డుకుంటోందని ఓ యువకుడు దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి నిప్పంటించి తగులబెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పరిధిలోగల లాధవాలా ప్రాంతంలో చోటు చేసుకుంది.
ముజఫర్‌నగర్: తన వేధింపులను అడ్డుకుంటోందని ఓ యువకుడు దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి నిప్పంటించి తగులబెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పరిధిలోగల లాధవాలా ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ యువకుడు ఆమెపై పెళ్లికి ముందు నుంచే వేధింపులకు పాల్పడేవాడు.
అప్పట్లో సహనంతో వ్యవహరించిన ఆమె పెళ్లయిన తర్వాత కూడా అతడు ఇలాంటి చర్యలకు దిగుతుంటే అడ్డు చెప్పడం ప్రారంభించింది. సోమవారం సాయంత్రం అతడి చర్యలు మరింత ఎక్కువ కావడంతో తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తనకే అడ్డు చెప్పుతావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె ఇంటికి నిప్పంటించాడు. బాధితురాలు తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.