వాట్సాప్ లో 'అభ్యంతరకర' సందేశం.. అరెస్ట్.. | Man arrested for circulating 'objectionable' message | Sakshi
Sakshi News home page

వాట్సాప్ లో 'అభ్యంతరకర' సందేశం.. అరెస్ట్..

Published Fri, Sep 9 2016 1:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

వాట్సాప్ లో 'అభ్యంతరకర' సందేశం.. అరెస్ట్..

వాట్సాప్ లో 'అభ్యంతరకర' సందేశం.. అరెస్ట్..

ముజఫర్ నగర్ః ప్రముఖ మెసేజింగ్ సర్వీస్... వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఓ సందేశం ఓ వ్యక్తి అరెస్టుకు దారి తీసింది.  అభ్యంతర కర సందేశం పోస్ట్ చేసిన కారణంగా  సదరు వ్యక్తిని ముజఫర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముజఫర్ నగర్ పాల్దీ గ్రామానికి చెందిన సుహైల్.. వాట్సాప్ లో పోస్ట్ చేసిన మెసేజ్ స్థానికంగా వివాదాస్పదమైంది. అతడి సందేశంలోని వివరాలు అభ్యంతర కరంగా ఉన్నాయని ఆరోపిస్తూ తమకు ఫిర్యాదులు అందాయని, దీంతో విచారణ చేపట్టి సుహైల్ ను అరెస్ట్ చేసినట్లు ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు. దేశానికి, ప్రజలకు అపఖ్యాతిని తెచ్చిపెట్టే విధంగా 'భారత మాత'పై అభ్యంతరకర సందేశాలను సుహైల్ వాట్సాప్ లో పోస్టు చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బీజేపీ కార్యకర్తలు తమకు ఫిర్యాదు చేసినట్లుగా సర్కిల్ ఆఫీసర్ సుధీర్ తోమార్ తెలిపారు. దీంతో విచారణ చేపట్టి.. శుక్రవారం సుహైల్ ను అరెస్టు చేశామని, కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సుధీర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement