రాజ్‌గర్: ఓ వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకర మెసేజ్ పోస్టవడంతో అనుకోకుండా గ్రూప్ అడ్మిన్ అయిన వ్యక్తి జైలుపాలయ్యాడు. ఓ వాట్సాప్ గ్రూప్ ప్రధాన అడ్మిన్.. ‘అడ్మిన్’ను వదలుకోవడంతో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు చెందిన జునైద్ మేవ్ (21) అడ్మిన్‌గా మారాడు. కేసు నమోదైనపుడు జునైద్ అడ్మిన్‌గా ఉండటంతో శిక్ష పడి 5 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నాడు. ‘రాజ్‌గర్ జిల్లా తలెన్‌కు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు ఈ ఏడాది ఫిబ్రవరి 14న అభ్యంతరకర మెసేజ్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశాడు.
దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా ఆ బాలుడిపై, గ్రూప్ అడ్మిన్ రాజా గుర్జార్‌పై పోలీసు కేసు నమోదైంది. కేసు సంగతి తెల్సి వెంటనే గ్రూప్‌ను గుర్జార్ వదిలేశాడు. వరుసక్రమంలో మరో ఇద్దరు అడ్మిన్‌లుగా మారినా వారు కూడా గ్రూప్‌ను వదిలేశారు. చివరగా జునైద్ అడ్మిన్‌గా మారడంతో అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న జునైద్.. ఐటీఐలో శిక్షణ కూడా పొందుతున్నాడు. దేశద్రోహం కింద కేసు నమోదవడంతో హైకోర్టు బెయిల్ నిరాకరించిందని అతని సోదరుడు ఫక్రుద్దీన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment